శంషాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ విలువ 78 కోట్లు

శంషాబాద్ లో పట్టుబడిన డ్రగ్స్ విలువ 78 కోట్లు

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఇవాళ ఉదయం పట్టుపడిన హెరాయిన్ విలువ 78 కోట్లు ఉంటుందని డీఆర్ఐ అధికారులు ప్రకటించారు. ఉగాండా, జింబాబ్వేల నుంచి వచ్చిన ఇద్దరు మహిళా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని అనుమానంతో వారి బ్యాగులను తనిఖీ చేయగా భారీగా హెరాయిన్ దొరికింది. తొలుత 8 కిలోల హెరాయిన్ దొరకగా.. మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయగా మరో 4 కిలోల హెరాయిన్ దొరికినట్లు సమాచారం. మొత్తం 12 కిలోల హెరాయిన్ దొరికిందని, వీటి విలువ మార్కెట్లో 78 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. 
నిన్న శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉగాండాకు చెందిన మహిళా ప్రయాణికురాలు వచ్చి తాన బ్యాగు విమానంలో మరచిపోయానంటూ వచ్చింది. ఈమె జింబాబ్వే నుండి దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్ బర్గ్, దోహా మీదుగా హైదరాబాద్ వచ్చినట్లు గుర్తించారు. జింబాబ్వేకు చెందిన మా కుంభ కారోల్ అనే ఈ మహిళా ప్రయాణికురాలి దగ్గర 8 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. 8 కేజీల హెరాయిన్ విలువ దాదాపు 53 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. హెరాయిన్ ను స్వాధీనం చేసుకోవడంతో పాటు... నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆమెకు చెందిన బ్యాగేజీ నుండి మరో 4 కిలోలు దొరికింది.