ఎయిర్ పోర్టులో రూ.13 కోట్ల కొకైన్ పట్టివేత.. కెన్యా నుంచి వస్తుంది..!

ఎయిర్ పోర్టులో రూ.13 కోట్ల కొకైన్ పట్టివేత.. కెన్యా నుంచి వస్తుంది..!

మన దేశంలోకి డ్రగ్స్ యథేచ్ఛగా ప్రవేశిస్తున్నాయి. యువతనే టార్గెట్ చేసుకున్న డ్రగ్స్ మాఫియా అనేక వక్ర మార్గాల్లో డ్రగ్స్ ని సప్లై చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తరచూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ ముఠా గుట్టు రట్టవుతునే ఉంది.పోర్టులు, విమానాశ్రయాల ద్వారా దేశంలోకి డ్రగ్స్ తీసుకొస్తున్నారు. తాజాగా కేరళలోని కొచ్చి విమానాశ్రయంలో 13కోట్ల రూపాయల విలువ చేసే కొకైన్ పట్టుకున్నారు అధికారులు. మంగళవారం కెన్యా దేశస్తుడు జంగా ఫిలిప్ నోరోజ్ 1300 గ్రాముల కొకైన్ తో వస్తుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ( DRI ) అధికారులు.

నిందితుడి పొట్టలో క్యాప్సూల్స్ రూపంలో 200 గ్రాముల కొకైన్, మద్యం బాటిల్ లో మరో 1100 గ్రాముల కొకైన్ ను గుర్తించారు అధికారులు.అదుపులోకి తీసుకున్న కెన్యా దేశస్తుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. కాగా, గత నెలలో కూడా కొచ్చి విమానాశ్రయంలో టాంజానియా దేశస్తుడి నుండి 32కోట్ల విలువచేసే 3.2కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు అధికారులు.