గ్రేటర్ వరంగల్ లో రంగు మారిన తాగునీరు

గ్రేటర్ వరంగల్ లో రంగు మారిన తాగునీరు

కాశీబుగ్గ (కార్పొరేషన్), వెలుగు: గ్రేటర్ వరంగల్ లో తాగు నీరు రంగుమారి వస్తోంది. ఇదే విషయమై ఆదివారం స్థానికులు బల్దియా మేయర్ గుండు సుధారాణి దృష్టికి తీసుకువెళ్లగా, ఆమె స్పందించా రు. కేయూ, ప్రతాపరుద్ర ఫిల్టర్ బెడ్లోని తాగునీటిని పరిశీలించి, సంబంధిత ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కావద్దని, ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బస్వరా జు కుమార స్వామి, ఈఈ రవి కుమార్, డీఈ సతీశ్, ఏఈ హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.