
- కాపాడిన స్థానికులు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు : ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు నిరంజన్ అనే డ్రైవర్ గురువారం సాయంత్రం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు స్పందించి అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడి కథనం ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన సూపర్‌లగ్జరీ బస్సు ఈ నెల 4న ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వస్తోంది. అందులో టిమ్ డ్రైవర్రవీందర్తో కలిసి డ్రైవర్ నిరంజన్ డ్యూటీలో ఉన్నాడు. ధర్మారం వద్ద ఆర్టీసీ విజిలెన్స్అధికారులు బస్సును తనిఖీ చేయగా ఇద్దరు టికెట్లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.
దానికి డ్రైవర్ నిరంజన్ను బాధ్యుడిగా చేసి అధికారులు సస్పెండ్ చేశారు. దీంతో కలత చెందిన నిరంజన్తన తప్పు ఏమీ లేదని వాదిస్తూ గురువారం సాయంత్రం డిపో ముందు పెట్రోల్‌పోసుకుని నిప్పంటించుకోబోయాడు. అక్కడున్నవారు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ మాట్లాడుతూ ప్రయాణికులకు టికెట్ఇవ్వాల్సిన బాధ్యత టిమ్డ్రైవర్ దేనని, నాన్ టిమ్ డ్రైవర్‌గా ఉన్న తనపై అధికారులు చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. అనవసరంగా అధికారులు తనను బలిచేశారన్నాడు. నిరంజన్ను రిమ్స్‌కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు.