
ఎల్బీ నగర్, వెలుగు: ఫుల్లుగా మద్యం తాగిన ఓ ప్రైవేట్అంబులెన్స్ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్ చౌరస్తాలో పోలీసులు మంగళవారం (ఏప్రిల్ 15) రాత్రి డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
ఆ సమయంలో మద్యం మత్తులో అంబులెన్స్ నడుపుతూ వచ్చిన డ్రైవర్ రమేశ్ ను పట్టుకున్నారు. అతన్ని బుధవారం కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ పేర్కొన్నారు.