
హైడ్రా.. ఏడాది కాలంగా హైదరాబాద్ లో ఆక్రమణదారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడిక్కడ కూల్చివేతలతో తరచూ వార్తల్లో నిలుస్తూ జనంలోకి చొచ్చుకుపోతోంది హైడ్రా. ఇంత ఫేమ్ ఉన్న హైడ్రాలో ఉద్యోగాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పడానికి ఈ ఘటన చాలు. హైడ్రాలో డ్రైవర్ ఉద్యోగాలు అనగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి యువత పోటెత్తారు. హైడ్రా పార్కింగ్ ఆఫీస్ దగ్గర పెద్ద సంఖ్యలో బారులు తీరారు యువత. సోమవారం ( మే 19 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.
ALSO READ | హైడ్రా కొరడా..మణికొండ డాలర్ హిల్స్ కాలనీలో కూల్చివేతలు
ఔట్ సోర్సింగ్ పద్దతిలో 200 డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది హైడ్రా. సోమవారం నుంచి బుధవారం ( మే 19, 21 ) వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది హైడ్రా. ఇటీవల పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలు రాసి.. స్వల్ప మార్కుల తేడాతో దూరమైన వారికీ ప్రాధాన్యత ఇస్తోంది హైడ్రా. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేందుకు అన్ని జిల్లాల నుంచి భారీగా యువత తరలి వచ్చారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడి దరఖాస్తు చేసుకున్నారు యువత.
గతంలో కూడా ఔట్ సోర్సింగ్ పద్దతిలో పలు నియామకాలు చేపట్టింది హైడ్రా. 2025 ఫిబ్రవరి నెలలో డీఆర్ఎఫ్ లోకి 357 కొత్త ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించింది హైడ్రా. ఈ ఉద్యోగులు అంబర్ పేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో వారం రోజుల శిక్షణ అనంతరం ఫీల్డ్ లోకి పంపారు. శిక్షణ కార్యక్రమంలో హైడ్రా కమీషనర్ రంగనాథ్ పాల్గొని ఉద్యోగులను దిశానిర్దేశం చేశారు.