
ఢిల్లీలోని రావుస్ IAS స్టడీ సర్కిల్ లోని గ్రౌండ్ ఫ్లోర్ వరదలో చిక్కుకొని శనివారం రాత్రి ముగ్గురు యూపీఎస్సీ అభ్యర్థులు చనిపోయారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు సోమవారం(ఈరోజు) నలుగురిని అరెస్ట్ చేశారు. బేస్ మెంట్ కి ఉన్న గేట్ ద్వంసం చేసిన డ్రైవర్ తోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావుస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్‌లోని బేస్ మెంట్ లోకి వచ్చిన వరద నీరు కారణంగా గదిలోనే చిక్కుకొని సివిల్స్ ప్రిపేర్ అవుతున్న ఓ అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు మృతి చెందారు. మరో 13మందిని రెస్క్యూ టీం కాపాడారు.
జూలై 28న రావుస్ స్టడీ సర్కిల్ ఓనర్, కో- ఆర్డినేటర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మరో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఈ కేసులో ఏడుగురిని అదుపులోకి తీసుకోని ఢిల్లీ పోలీసులు విచారిస్తు్న్నారు. కారు బేస్ మెంట్ లోకి వెళ్లడానికి డ్రైవర్ బేస్ మెంట్ గేటు విరగగొట్టాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తప్పు చేసిన వారిని విడిచిపెట్టమని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీసీపీ ఎం హర్షవర్ధన్ అన్నారు.