స్వీడన్: కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిన ఓ వృద్ధుడిని డ్రోన్ కాపాడింది. సమయానికి డీఫిబ్రిల్లేటర్ అందించడంతో ప్రాణాలతో బయటపడ్డడు. స్వీడన్‌లోని ట్రోల్‌హట్టన్‌లో ఇంటి బయటికి వచ్చిన ఒక వృద్ధుడు కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలాడు. అదే దారిలో కారులో హాస్పిటల్‌కు వెళుతున్న డాక్టర్ ముస్తఫా అలీ ఈ వృద్ధుడి పరిస్థితి చూసి హెల్ప్ చేయడానికి వచ్చారు. పల్స్ అందకపోవడంతో సీపీఆర్ (కార్డియోపల్మనరీ రిసస్కిటేషన్) చేయడం స్టార్ట్ చేశారు. అక్కడే ఉన్న వ్యక్తిని ఎమర్జెన్సీ నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
“కాల్ చేసిన 3 నిమిషాల తరువాత తలపై ఏదో ఎగురుతున్నట్టు అనిపించి పైకి చూశాను. ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిల్లేటర్ (గుండె కొట్టుకోవడానికి సహాయపడే మిషన్)ను తీసుకుని ఒక డ్రోన్ కనిపించింది. దానిని ఉపయోగించి ట్రీట్‌మెంట్ చేశా” అని డాక్టర్ పేర్కొన్నారు. ఈ డ్రోన్‌ను కరోలిన్‌స్కా ఇనిస్టిట్యూట్‌తో కలిసి డెవలప్ చేశామని ఎవర్‌డ్రోన్ కంపెనీ తెలిపింది. అన్నిచోట్లా ఇది అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నట్టు పూర్తిగా రికవర్ అయిన వృద్ధుడు చెప్పాడు.
