కరోనా కట్టడిలో కీలకంగా మారిన డ్రోన్లు

కరోనా కట్టడిలో కీలకంగా మారిన డ్రోన్లు

న్యూఢిల్లీ : కరోనా పై పోరులో డ్రోన్ కెమెరాలు కీలకంగా మారాయి. సోషల్ డిస్టెన్స్, డిస్ ఇన్ ఫెక్ట్ స్ప్రే, జనం గుమిగుడకుండా నివారించేందుకు ఇప్పుడు డ్రోన్ కెమెరాలనే వాడుతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కరోనాను అరికట్టేందుకు వీటిని వినియోగించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ బెన్ ఫిట్ ఉండటంతో డ్రోన్ కెమెరాల వినియోగం రోజుకు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు పలు ప్రభుత్వ విభాగాలు డ్రోన్ కెమెరాల ద్వారా స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. ఇక లాక్ డౌన్ ను పక్కాగా అమలు చేసేందుకు కూడా డ్రోన్లే పోలీసులకు ప్రధాన అస్త్రాలుగా మారాయి. ఒక్కటి కాదు రెండు దేశంలోని అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసేందుకు వీటిపైనే ఆధారపడుతున్నాయి. గుజరాత్ లో పోలీసులు దాదాపు 2 వందల డ్రోన్ కెమెరాలతో రద్దీ ఎక్కువగా ఎక్కడుతుందన్నది తెలుసుకుంటున్నారు. అన్ని జిల్లాలో డ్రోన్ లతో నిఘా పెట్టారు. ఢిల్లీలోని అతి పెద్ద ఫ్రూట్స్ అండ్ వెజిటెబుల్ మార్కెట్ అజాద్ పూర్ మండీని డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నారు. జనం ఎక్కువగా గుమిగూడితో పోలీసులు క్షణాల్లో అక్కడి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. మధురైలో మున్సిపాలిటీ అధికారులు డ్రోన్లతోనే డిస్ ఇన్ఫెక్షన్ స్ర్పే ను చల్లుతున్నారు. వరంగల్ లో లాక్ డౌన్ పర్యవేక్షణ, డిస్ ఇన్ఫెక్షన్ కోసం డ్రోన్ లనే వినియోగిస్తున్నారు. ప్రభుత్వం ఏజెన్సీలే కాదు మీడియా సంస్థలు కూడా ప్రస్తుతం కవరేజీ కోసం విస్తృతంగా డ్రోన్ లనే వినియోగిస్తున్నాయి. దీంతో డ్రోన్ల వినియోగం భారీగా పెరిగింది. దాదాపు 20 వేల మంది డ్రోన్స్ ను వాడేందుకు గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ కోసం అప్లయ్ చేసుకున్నారని డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ స్మిత్ షా తెలిపారు. ప్రస్తుతం కరోనా నివారణకు డ్రోన్ స్టార్టప్ కంపెనీలు గవర్నమెంట్లకు ఫ్రీ గా డ్రోన్లను అందించాలని ఆయన కోరారు. అదే విధంగా డ్రోన్ కెమెరాలతో ప్రయోజనం దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ఆయా కంపెనీలకు ప్రోత్సహాకాలు ప్రకటించాలని ఫిక్కీ డ్రోన్ కమిటీ సభ్యుడు అంకిత్ మెహతా కోరారు.