బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ హెచ్చరిక..

బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ అథారిటీ హెచ్చరిక..

తెలంగాణలోని బ్లడ్ బ్యాంకులకు డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. రక్తానికి సంబంధించి అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.  ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులతోపాటు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకు ప్రాసెసింగ్ చార్జీలను మించి వసూలు చేయరాదని డ్రగ్ కంట్రోల్ అథారిటీ సూచించింది. ప్రతి బ్లడ్ బ్యాంక్ వద్ద చార్జీలను డిస్ప్లే చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అధిక చార్జీలు వసూలు చేస్తే 1800-599-6969 కు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించింది.

9 బ్లడ్ బ్యాంకులకు నోటీసులు..

 కొన్ని రోజుల క్రితమే రాష్ట్ర వ్యాప్తంగా పలు బ్లడ్ బ్యాకుల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేశారు. హైదరాబాద్ నగరంలోని తొమ్మిది బ్లడ్ బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. బ్లడ్ బ్యాంకుల నిల్వ,, రక్త సేకరణ ..పరీక్షలలో పూర్తిగా లోపాలున్నట్లు గుర్తించింది. అంతే కాకుండా ప్లేట్లెట్స్ ,ప్లాస్మా నిల్వ లో కూడా పూర్తిగా లోపాలు గుర్తించింది డ్రగ్ కంట్రోల్ బ్యూరో.