దుండిగల్ లో డ్రగ్స్ ముఠా అరెస్టు

 దుండిగల్ లో డ్రగ్స్ ముఠా అరెస్టు

హైదరాబాద్ సిటీలోని దుండిగల్ లో డ్రగ్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.  గండి మైసమ్మ ప్రాంతంలో ఇద్దరు  వ్యక్తులు అనుమానస్పదంగా ద్విచక్ర వాహనంలో వెళుతుండగా వారిని ఆపి తనిఖీ చేశారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసు అధికారులు.  వాహనం తనిఖీ చేయగా టూల్ కిట్ బాక్స్ లో ఎండీఎంఏ డ్రగ్స్ గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులు క్రాంతి, మహమ్మద్ సోహెల్ లను అదుపులోకి తీసుకున్నారు. 

నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ మార్కెట్ లో దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు.  బెంగళూరు నుంచి కిరణ్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ కి ఈ డ్రగ్స్ ను తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.