యువత నాశనానికి  డ్రగ్స్​ మాఫియా కుట్ర

యువత నాశనానికి  డ్రగ్స్​ మాఫియా కుట్ర
  • ఆర్ఎస్ఎస్ ​తెలంగాణ ప్రాంత ప్రచారక్​  దేవేందర్

వికారాబాద్, వెలుగు: దేశ యువతను మత్తులో ముంచుతూ.. వారిని నాశనం చేసేందుకు  డ్రగ్స్ మాఫియా కుట్ర పన్నిందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తెలంగాణ ప్రాంత ప్రచారక్ దేవేందర్ ఆరోపించారు.  వికారాబాద్​ జిల్లా పరిగిలో బుధవారం జరిగిన ఆర్ఎస్ఎస్ ​ప్రాథమిక శిక్షా వర్గ ముగింపు సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మనదేశ జీవన విధానం ప్రకృతితో మమేకమై ఉంటుందని, అందుకే ప్రపంచ దేశాలు భారత సంస్కృతిని గౌరవిస్తాయని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాల్లో చాలా మంది సోదరభావంతో ఉంటారని, అదే మన జీవన విధాన గొప్పతనమన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్ లాంటి దేశాలు అదే ఉగ్రవాదానికి బలై పోతున్నాయన్నారు.  కార్యక్రమంలో వక్తలు హరిశ్చందర్, సంఘ్ చాలక్​లు శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, వర్గాధికారి ఎల్లయ్య , బ్రహ్మయ్య పాల్గొన్నారు.

Caption