మందేసి ర్యాష్ డ్రైవింగ్..15 రోజుల్లో 8 యాక్సిడెంట్స్‌‌

మందేసి ర్యాష్ డ్రైవింగ్..15 రోజుల్లో 8 యాక్సిడెంట్స్‌‌
  • సిటీలో 15 రోజుల్లోనే 8 యాక్సిడెంట్స్‌‌
  • నలుగురు మృతి,14 మందికి గాయాలు
  • డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ లు లేవు
  • రెచ్చిపోతున్న మందుబాబులు

హైదరాబాద్,వెలుగు:   కరోనా ఎఫెక్ట్ తో డ్రంకన్ డ్రైవ్ బంద్​పెట్టడంతో మందులు బాబులు రెచ్చిపోతున్నారు. ఇష్టమొచ్చినట్లు తాగేసి బండ్లేసుకొని రోడ్లపైకి వస్తున్నారు. మత్తులో యాక్సిడెంట్స్ చేస్తున్నారు. ఇలా15 రోజుల్లోనే 8 యాక్సిడెంట్స్ చేశారు. ఇందులో నలుగురు మృతి చెందగా, 14 మంది గాయపడ్డారు. ముఖ్యంగా సైబర్‌‌ ‌‌టవర్స్‌‌, రాచకొండ తుర్కయంజాల్‌‌, గచ్చిబౌలి హెచ్‌‌సీయూ వద్ద ఇటీవల జరిగిన మూడు యాక్సిడెంట్స్ కు డ్రంకన్ డ్రైవ్సే కారణమని పోలీసులు తేల్చారు. ఆయా యాక్సిడెంట్లలో నలుగురు చనిపోయారు.  కరోనా కారణంగా డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లు నిలిపేయడం, లాక్ డౌన్ కారణంగా చాలా రోజుల పాటు యాక్సిడెంట్లు జరగలేదు. ఇటీవల అన్ లాక్ తో సిటీ లో లైఫ్ మళ్లీ నార్మల్ గా మారింది. పబ్ లు, రెస్టారెంట్లు ఎప్పటిలాగే నడుస్తున్నాయి. దీంతో డ్రంకెన్ డ్రైవ్ చెకింగ్ లు లేకపోవడాన్ని చాలా మంది మందుబాబులు అడ్వంటేజ్ గా తీసుకుంటున్నారు.

అలర్టైన పోలీసులు

వరుసగా డ్రంకన్ డ్రైవ్ తో యాక్సిడెంట్లు అవుతుండడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. చెక్ పెట్టాలని నిర్ణయించారు. మళ్లీ షురూ చేయాలని భావిస్తున్నారు. లా అండ్ ఆర్డర్‌‌ ‌‌పోలీసులతో కలిసి ట్రాఫిక్ పోలీసులు స్పెషల్‌‌ డ్రైవ్‌‌ కు రెడీ అయ్యారు.  కరోనా రూల్స్ కు అనుగుణంగా బ్రీత్ ఎనలైజర్లతో టెస్ట్ చేయనున్నారు. యాక్సిడెంట్లు జరిగిన టైమ్​లో డ్రైవ్ చేసిన వారికి మస్ట్​గా బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి 304 పార్ట్ II కింద కేసులు బుక్​అవుతున్నాయి.  పబ్బులు, బార్‌‌ నిర్వాహకులకు ప్రత్యేక గైడ్‌‌లైన్స్‌‌ జారీ చేయనున్నారు. పబ్స్‌‌ బయట సీసీటీవీ కెమెరాలు ఉండేలా,  డ్రంకన్‌‌ కండీషన్‌‌లో డ్రైవింగ్‌‌చేసే వారిని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

స్పెషల్ డ్రైవ్ కు రూట్​ మ్యాప్​

డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ ఏరియాల రూట్‌‌మ్యాప్‌‌ క్రియేట్‌‌ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం బార్లు, పబ్బులు, ర్యాష్‌‌ డ్రైవింగ్‌‌కి అవకాశాలు ఉన్న ఏరియాలను గుర్తిస్తున్నారు. గతేడాది వరకు రిజిస్టరైన డ్రంకన్ డ్రైవ్‌‌ కేసుల ఆధారంగా ప్రమాదాలు ఎక్కువ జరిగే స్పాట్స్‌‌ డేటా కలెక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు బ్రీత్‌‌ ఎనలైజర్స్‌‌ ఉపయోగంపై సేఫ్టీ ప్రికాషన్స్‌‌ తీసుకుంటున్నారు. స్పెషల్‌‌ డ్రైవ్స్‌‌ కోసం సెలెక్ట్ చేయని ప్రాంతాల్లో మాత్రం ర్యాండమ్‌‌గా చెక్‌‌ చేయనున్నారు.

డ్రంకన్ డ్రైవ్స్ తో చెక్ పెడతాం

లాక్ డౌన్ లోనూ కరోనా ప్రీకాషన్స్ తీసుకొని కొన్ని డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ లు చేశాం. అన్​లాక్​లో ఓవర్‌‌ ‌‌స్పీడ్, డ్రంకన్‌‌ డ్రైవ్‌‌ లతో వరుసగా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీంతో మళ్లీ రెగ్యులర్ డ్రంకన్‌‌ డ్రైవ్ స్పెషల్‌‌ డ్రైవ్ నిర్వహిస్తాం.  ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.

– సిటీ ట్రాఫిక్ పోలీసులు