మద్యమే అలవాటు లేదు.. 85 పాయింట్ల ఆల్కహాల్

మద్యమే అలవాటు లేదు.. 85 పాయింట్ల ఆల్కహాల్

కరీంనగర్ : అసలు ఆల్కహాల్ అలవాటే లేని ఆర్టీసీ డ్రైవర్ డ్రంక్ అనలైజర్ మిషన్ కు చిక్కాడంతో TMU ఆధ్యర్యంలో డిపో ముందు నిరసన చేపట్టారు RTC డ్రైవర్లు. ఈ సంఘటన మంగళవారం కరీంనగర్ ఆర్టీసీ వన్ డిపోలో జరిగింది. డ్యూటీకి హాజరైన రమేష్ అనే డ్రైవర్ కు బ్రీత్ అనలైజర్ మిషన్ తో శ్వాస పరీక్ష చేయగా.. 85 పాయింట్ల ఆల్కహాల్ నమోదైంది.

అసలు మద్యమే అలవాటు లేని రమేశ్ కు.. నాణ్యత లేని మిషన్ తో పరీక్షించారంటూ ఆర్టీసీ డ్రైవర్లు ఆరోపించారు. వెంటనే డీపో అధికారులు డ్రైవర్ రమేష్ ను హస్పిటల్ కు తరలించి టెస్టు నిర్వహించారు. రక్త పరీక్షలో జీరో ఆల్కహాల్ రీడింగ్ వచ్చింది. దీంతో అసలు విషయం తెలుసుకున్న అధికారులు డ్రైవర్ ను వదిలేశారు.