డ్రంక్​ అండ్​ డ్రైవ్ లో డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌...

డ్రంక్​ అండ్​ డ్రైవ్ లో డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌...

న్యూ ఇయర్​ వేళ నార్కొటిక్​ పోలీసులు రంగంలోకి దిగుతున్నారు. అత్యాధునిక టెక్నాలజీతో డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తరహాలో  డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి ( డిసెంబర్​ 31) నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి. లాలాజలంతో పాటు అవసరమైతే మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రాగానే అప్పటికప్పుడే డ్రగ్స్ తీసుకుంటే పాజిటివ్ రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్ రిపోర్టు రాగానే మరిన్ని పరీక్షల కోసం మూత్ర పరీక్షలను అధికారులు చేయనున్నారు.

రెండింటిలోనూ పాజిటివ్ రిపోర్టు వస్తే సదరు వ్యక్తిని అధికారులు అదుపు తీసుకోనున్నారు. డ్రగ్స్ తీసుకున్న మూడు రోజుల తర్వాత కూడా రక్త, మూత్ర పరీక్షల్లో వ్యవహారం బయటపడనుంది. నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వినియోగం అరికట్టడమే లక్ష్యం అని నార్కోటిక్ బ్యూరో అంటోంది. ఒక్కో కమిషనరేట్‌కు 25 చొప్పున డ్రగ్ డిటెక్షన్ పరికరాలు అందించనున్నారు. ట్రై కమిషనరేట్ పరిధిలో జంక్షన్ల వద్ద డ్రగ్ డిటెక్షన్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. డ్రగ్ డిటెక్షన్ పరీక్షలపై పోలీసులకు ఇప్పటికే శిక్షణ పూర్తి అయింది. ఇక పరీక్షలను ముమ్మరంగా నిర్వహించనున్నారు.