తాగి ఊగుతూ..అరుస్తూ.. నడిరోడ్డుపై.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం

తాగి ఊగుతూ..అరుస్తూ.. నడిరోడ్డుపై.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని వీరంగం

అతనో ప్రజాప్రతినిధి.. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే..ప్రజలపట్ట బాధ్యతగా ఉండి.. ఇతరులకు ఆదర్శంగా ఉండాల్సిన నేత. కానీ తప్ప తాగి రోడ్లపై బీభత్సం సృష్టించారు. పోలీసుల ఎదుటే వీధి రౌడీలా ప్రవర్తించారు. మరో నేత ఇంటిపై దాడికి యత్నించారు. మీ అంతూ చూస్తామంటూ బెదిరించారు. అర్థరాత్రి సొంత పార్టీ నేతఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటిపై దాడికి యత్నంచారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. వివరాల్లోకి వెళితే.. 

ఆదివారం అర్థరాత్రి ఏపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. సొంత పార్టీ నేత అయిన ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటిపై అనుచరులతో కలిసి దాడికి యత్నించారు. తప్పతాగిన చింతమనేని రాత్రి 11 గంటలకు శ్రీనివాస్ ఇంటికి వెళ్లి బీభత్సం సృష్టించారు.పోలీసులు సమక్షంలోనే చింతమనేని రెచ్చిపోయారు.  

మద్యం మత్తులో ఊగుతూ ..అరుస్తూ బీభత్సం సృష్టించారు. పోలీసుల సమక్షంలోనే రౌడీలా ప్రవర్తించారు.  ఇద్దరిలో ఎవరో ఒకరే ఉండాలంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులువారించినా లెక్క చేయకుండా రెచ్చిపోయి బూతులు తిట్టారు చింతమనేని. తన అక్రమాలను బయట పెట్టినందుకే చింతమనేని దాడి  చేశారని శ్రీనివాస్ వర్గం చెబుతోంది.