మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్పై దాడి .. నిందితుడు అరెస్ట్

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్పై దాడి .. నిందితుడు అరెస్ట్

జూబ్లీహిల్స్, వెలుగు: మద్యం మత్తులో ట్రాఫిక్​పోలీస్​పై దాడి చేసిన ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. విజయవాడకు చెందిన హరిహరణ్​నగరంలోని ఓ హాస్టల్ లో ఉంటున్నాడు. ఈ నెల 26న రాత్రి ట్రాఫిక్ పోలీసులు మధురానగర్​పోలీస్​స్టేషన్​పరిధిలో పిల్లర్​నంబర్​1022 వద్ద డ్రంకెన్​ డ్రైవ్ ​తనిఖీలు చేపట్టారు. 

ఆ సమయంలో మద్యం మత్తులో బైక్​పై వచ్చిన హరిహరణ్​ను ఆపారు. ఆల్కహాల్ టెస్ట్​చేసేందుకు ప్రయత్నించగా అతను కోపోద్రిక్తుడై ఆర్ఎస్సై నాగరాజుపై దాడి చేశాడు. పోలీసులు హరిహరణ్​ను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.