
హైదరాబాద్ సిటీ రద్దీ ఏరియా అయిన కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు మెట్రో స్టేషన్ దగ్గర అర్థరాత్రి అమ్మాయిలు రచ్చ రచ్చ చేశారు. ఫుల్ గా మందు కొట్టిన ముగ్గురు అమ్మాయిలు.. కారులో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్స్ ను ఢీకొట్టారు. కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ దగ్గర 24 గంటలూ రద్దీగానే ఉంటుంది. ఇలాంటి ఏరియాలో.. బాగా మందు కొట్టిన ముగ్గురు అమ్మాయిలు.. కారులో వేగంగా వస్తూ.. వాహనాలను ఢీకొట్టారు. బైక్స్ ను ఢీకొట్టటమే కాకుండా.. ప్రశ్నించిన యువకులపై రెచ్చిపోయి మరీ దాడులకు దిగారు. ఇదంతా మెట్రో స్టేషన్ దగ్గర.. నడిరోడ్డుపై జరిగింది.
ఈ ఘటన జరిగిన ప్రదేశం.. KPHB పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉండటం విశేషం. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ బైక్స్ ను ఢీకొట్టటమే కాకుండా.. రోడ్డుపైనే కారు ఆపేసి.. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగటంతో పోలీసులకు కంప్లయింట్ ఇచ్చారు వాహనదారులు.
రంగంలోకి దిగిన పోలీసులు.. కారులో అమ్మాయిలకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. 200 పాయింట్లపైనే రీడింగ్ వచ్చింది. అంటే ఏ రేంజ్ లో వాళ్లు మందు కొట్టారో అర్థం అవుతుంది. ఫుల్ గా మందుకొట్టి.. ఒంటి సోయి లేకుండా.. ఇష్టానుసారం కారు డ్రైవ్ చేస్తూ.. నడిరోడ్డుపైనే బీభత్సం చేయటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. అర గంటపాటు కేపీహెచ్ బీ ఏరియాలో నడిరోడ్డుపై సినిమా సీన్ సృష్టించారు ఈ తాగుబోతు అమ్మాయిలు.
ALSO READ | గుడ్ న్యూస్: మహిళా దినోత్సవం సందర్భంగా.. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ.. ఇందిరా మహిళా శక్తి బస్సులు ప్రారంభం
కారులో ముగ్గురు అమ్మాయిలు ఉండగా.. ఈ ముగ్గురూ మందు కొట్టినట్లు చెబుతున్నారు బాధిత వాహనదారులు. ఫొటోలు, వీడియో తీస్తున్న వాళ్లపైనా దాడులు చేశారని చెబుతున్నారు. ట్రాఫిక్ పోలీసుల ఎంట్రీతో.. వాళ్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి.. కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
వీళ్లు ఎవరు.. ఎక్కడి వారు.. ఈ ముగ్గురు అమ్మాయిలు ఏం చేస్తుంటారు.. ఏం చదువుకున్నారు.. మందు ఎక్కడ కొట్టారు.. ఎక్కడి నుంచి వస్తున్నారు అనే విషయాలను మాత్రం పోలీసులు కొంచెం గోప్యంగానే ఉంటారు.. అమ్మాయిలు కదా..