అడుగంటుతున్న బోర్లు.. ట్యాంకర్ నీరే దిక్కు

అడుగంటుతున్న బోర్లు.. ట్యాంకర్ నీరే దిక్కు

ఎండలు ముదురుతుండడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. మెదక్​జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్‌‌ గ్రామానికి చెందిన ఓ రైతు 2.10 ఎకరాల్లో వరిసాగు చేశాడు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా బోర్లలోంచి నీరు అందకపోవడంతో పంటను రక్షించుకునేందుకు ట్యాంకర్‌‌తో నీరు పెడుతున్నాడు.