Summer receipes: మామిడి.. చింతపండు  పచ్చిపులుసు అన్నం.. ఎండాకాలం సల్లగా గొంతులోకి దిగుద్ది..! 

Summer receipes: మామిడి.. చింతపండు  పచ్చిపులుసు అన్నం.. ఎండాకాలం సల్లగా గొంతులోకి దిగుద్ది..! 

ఎండలు మస్తు ఎక్కువ అయితున్నయ్. వేడి రోజురోజుకు పెరుగుతోంది. సల్వ జేసే వంటలు తింటే ఒంటికి మంచిది. అందుకే, బువ్వలోకి సల్వ జేసే పచ్చిపులుసు  చేసుకుని తింటే ఒళ్లు కాస్త చల్ల పడ్డది. ఎండాకాలంలో గొంతులోకి సల్లగ జారుతుంటే అన్నం కూడా మంచిగ తినాలనిపిస్తది. మరి సల్వ జేసేటి ఆ పులుసులేవో? వాటిని ఎట్ల చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మామిడికాయ పచ్చిపులుసు తయారీకి కావాల్సినవి

  • మామిడికాయ: ఒకటి
  • పచ్చిమిర్చి :మూడు
  • మెంతులు: ఒక టేబుల్ స్పూన్
  • ధనియాలు: ఒక టేబుల్ స్పూన్
  • జీలకర్ర: ఒక టేబుల్ స్పూన్
  • నువ్వులు: ఒక టీ స్పూన్
  • ఎండుమిర్చి: రెండు
  • ఉల్లిగడ్డ తరుగు: ఒకకప్పు
  • ఉప్పు: తగినంత
  • నీళ్లు: తగినన్ని (పులుపుకు తగ్గట్లు)
  • తాలింపు కోసం: జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకు
  • పసుపు: చిటికెడు
  • కొత్తిమీర కొంచెం

మామిడికాయ పచ్చిపులుసు తయారీ విధానం

మామిడికాయ పచ్చిమిర్చిపొయ్యిమీద కాల్చాలి. ఆ తర్వాత కళాయిలో నువ్వులు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి దోరగా వేగించాలి. ఆ తర్వాత రెండు ఎండుమిర్చి కలిపి మిక్సీ పట్టాలి.
మామిడికాయ పై పొట్లు తీసేసి ముక్కలుగా తరగాలి.

ఆ తర్వాత మామిడిముక్కలు, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టాలి. ఒక గిన్నెలో మామిడికాయ పేస్ట్ తయారు చేసుకున్న మసాలా పొడి వేసి, నీళ్లు పోస్తూ కలపాలి. పులుపును బట్టి నీళ్లు కలపాలి. ఆ తర్వాత ఉల్లిగడ్డ తరుగు, పసుపు, ఉప్పు వేసి కలపాలి.


ఒక కళాయిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండు మిర్చి, కరివేపాకు వేగించాలి.  తర్వాత పచ్చిపులుసులో కలుపుకుంటే నోరూరించే పల్లటి మామిడి పచ్చిపులుసు రెడీ.

చింతపండు పచ్చిపులుసు తయారీకి కావాల్సినవి

 

  • చింతపండు: 25 గ్రాములు
  • పచ్చిమిర్చి:  రెండు
  • ఉల్లిగడ్డ ముక్కలు: ఒక కప్పు
  • నువ్వుల పొడి :కొద్దిగ
  • బెల్లం: కొంచెం
  • ఉప్పు: తగినంత
  • నీళ్లు: తగినన్ని
  • కరివేపాకు: కొంచెం
  • తాలింపునకు: జీలకర్ర, ఆవాలు, ఎండు మిర్చి
  • చిటికెడు: పసుపు

చింత పండు పచ్చి పులుసు తయారీ విధానం


చింతపండును 20 నిమిషాలు నీళ్లలో నానబెట్టి గుజ్జు తీయాలి. పచ్చిమిర్చిని స్టవ్ లేదా కట్టెల పొయ్యి మీద కాల్చి, రోటిలో వేసి దంచాలి.

తర్వాత చింతపండు పులుసులో పచ్చి మిర్చి పేస్ట్, ఉల్లిగడ్డ ముక్కలు, ఉప్పు, సువ్వులపొడి, కొద్దిగా బెల్లం వేసి కలపాలి. పులుపు ఎక్కువైతే ఇంకొన్ని నీళ్లు పోసుకోవచ్చు.

పొయ్యిమీద బాండీ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. అది కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగించాలి. తర్వాత పచ్చిపులుసులో కలపాలి. దీన్ని పెసరపప్పుతో కలుపుకుని తింటే మంచి రుచిగా ఉంటుంది.