తెలంగాణలో వచ్చే వారం రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే.?

తెలంగాణలో వచ్చే వారం రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే.?

 తెలంగాణలో వాతావరణం భిన్నంగా ఉంటుంది. ఉదయం పూట చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం వచ్చే సరికి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మళ్లీ సాయంత్రం చల్లటి వాతావరణం కనిపిస్తోంది.  రాష్ట్రంలో మరో వారం  రోజుల పాటు అంటే  ఫిబ్రవరి 11 వరకు  రాష్ట్రంలో ఇలా భిన్నంగా ఉంటుందని తెలంగాణ వాతావరణ శాఖ వెల్లడించింది. 

వర్ష సూచనలు లేవు కానీ....అక్కడక్కడ ఉదయం పూట పొగమంచు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పగటి పూట  గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 20డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది.  ఉపరితల గాలలు దక్షిణ ఆగ్నేయ దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది.

కర్నాటక కోస్తా నుంచి తెలంగాణ పక్క నుంచి విదర్భ మీదుగా మధ్యప్రదేశ్ వరకు 900 కిలోమీటర్ల మేర ఎత్తున ద్రోణి ఏర్పడిందని తెలంగాణ వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.  తూర్పు, ఆగ్నేయ భారతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలులు ఈ ద్రోణి వల్ల భూమి మీదకు వస్తున్నాయని తెలిపారు.