టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టిన టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. ఇటీవలే సౌతాఫ్రికాతో ముగిసిన తొలి టెస్టులో ఓటమి తర్వాత గంభీర్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇప్పటివరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు ఐదు టెస్ట్ సిరీస్ లు ఆడింది. వీటిలో రెండు గెలిచి రెండు ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సమమైంది. గెలిచిన రెండు సిరీస్ లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటివరకు విఫలమయ్యాడనే చెప్పాలి.
బంగ్లాదేశ్ తో బోణీ:
తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై ఈజీగా గెలిచిన టీమిండియా కాన్పూర్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అద్భుతం చేసింది. తొలి మూడు రోజుల తర్వాత డ్రా ఖాయమన్న దశలో చివరి రెండు రోజులు రోహిత్ సేన అసాధారణంగా పోరాడి గెలిచింది. చివరి రోజు బంగ్లాదేశ్ విధించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలో ఛేజ్ చేసింది. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ (51), కోహ్లీ (29) జాగ్రత్తగా ఆడి భారత్ కు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0 తేడాతో గెలుచుకుంది. గంభీర్ కు కోచ్ గా ఇదే తొలి సిరీస్ విజయం.
స్వదేశంలో చేదు జ్ఞాపకం:
టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టాక ఇది చేదు జ్ఞాపకమనే చెప్పుకోవాలి. స్వదేశంలో 12 ఏళ్లుగా ప్రత్యర్థిని వణికిస్తూ ఒక్క సిరీస్ ఓడిపోకుండా విజయాలు సాధిస్తూ వచ్చిన టీమిండియాకు న్యూజిలాండ్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 3-0 తేడాతో గెలిచి భారత జట్టు టెస్ట్ ఛాంపియన్ షిప్ అవకాశాలను సంక్లిష్టం చేసింది. ఈ సిరీస్ లో గంభీర్ చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. ఈ సిరీస్ ఓటమితో గంభీర్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఆస్ట్రేలియాపై ఘోర పరాజయాలు:
బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఇండియాపై ఆస్ట్రేలియా 3-1 తేడాతో గెలుచుకుంది. తొలి టెస్ట్ భారత్ గెలవగా.. ఆ తర్వాత నాలుగు టెస్టుల్లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో జయభేరి మోగించింది. బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్ట్ డ్రా గా ముగిసింది. ఈ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ కు ఆసీస్ అధికారికంగా అర్హత సాధించింది. మరోవైపు ఇండియా ఓడిపోయి టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ సిరీస్ ఓటమితో గంభీర్ ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపంచింది.
►ALSO READ | IND vs SA: గౌహతి టెస్టుకు గిల్ దూరం.. సాయి సుదర్శన్ కాదు పడికల్‌కే ప్లేయింగ్ 11లో ఛాన్స్
ఇంగ్లాండ్ తో సిరీస్ సమం:
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2-2తో సమం చేసింది. తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా రెండో టెస్టులో అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చి భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. మూడో టెస్టులో గెలిచే మ్యాచ్ లో ఓడిపోయిన మన జట్టు.. నాలుగో టెస్టును డ్రా చేసుకుంది. ఓవల్ టెస్టులో టీమిండియా అద్భుతం చేసింది. ఇంగ్లాండ్ పై ఓడిపోయే టెస్టులో 6 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ అందుకొని సిరీస్ ను 2-2 తో సమం చేసింది. గంభీర్ కు ఈ సిరీస్ మంచి పేరు తెచ్చిపెట్టింది.
వెస్టిండీస్ పై సిరీస్ క్లీన్ స్వీప్:
వెస్టిండీస్ తో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను టీమిండియా 2-0 తేడాతో విజయం సాధించింది. అహ్మదాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన గిల్ సేన.. ఢిల్లీ టెస్టులో 7 వికెట్ల తేడాతో నెగ్గింది. బలహీనమైన వెస్టిండీస్ తో గెలవడం వలన గంభీర్ కు పెద్దగా పేరు రాలేదు. ఓవరాల్ గా గంభీర్ హెడ్ కోచ్ గా ఇండియా 18 మ్యాచ్ ల్లో ఆడితే 7 మ్యాచ్య్ ల్లో గెలిచి న మ్యాచ్ ల్లో ఓడిపోయింది. 2 టెస్టులు డ్రా గా ముగిశాయి.
