- సర్వం సిద్ధం చేసిన ఉమ్మడి జిల్లా యంత్రాంగం
- నిజామాబాద్ నగరపాలక, మున్సిపాలిటీల్లో 146 స్థానాలు
- కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీల్లో 92 వార్డులు
నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు: పురపాలక ఎన్నికలకు ఉమ్మడి జిల్లాయంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. మంగళవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. నిజామాబాద్ కార్పొరేషన్‌తోపాటు, ఆర్మూర్, భీంగల్, బోధన్ మున్సిపాలిటీల్లో 146 స్థానాలు, కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్కుంద మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచి నామినేషన్ల స్వీకరణకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం సెంటర్లను ఏర్పాటు చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్వోలు) బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు తీసుకుంటారు. 30వ తేదీ సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల గడువు ముగుస్తుంది.
నిజామాబాద్ కార్పొరేషన్...
నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా, 348,051 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,67,461 మంది, మహిళలు 1,80,546 మంది, ఇతరులు 44 మంది ఉన్నారు. ప్రతి మూడు డివిజన్లకు ఒకటి చొప్పున నామినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. 1, 2, 3 డివిజన్లు (గూపన్పల్లి వార్డ్ ఆఫీస్), 4, 5, 6 డివిజన్లు (సీఆర్సీ బిల్డింగ్, వినాయక్‌నగర్), 7, 8, 9 డివిజన్లు (లేబర్ ఆఫీస్, శివాజీనగర్), 10, 11, 12 డివిజన్లు (అంబేద్కర్ భవన్, నాగారం), 13, 14, 15 డివిజన్లు (ఫిషరీస్ ఆఫీస్, బోధన్ రోడ్), 16, 17, 18 డివిజన్లు (కమ్యూనిటీ హాల్, వాటర్ ట్యాంక్, గౌతంనగర్), 19, 20, 21 డివిజన్లు (జోన్-4 ఆఫీస్, వాటర్ ట్యాంక్, కంఠేశ్వర్), 22, 23, 24 డివిజన్లు (మహిళా భవన్, కమ్యూనిటీ హాల్, వినాయక్‌నగర్), 25, 26, 27 డివిజన్లు (టీటీడీ కల్యాణ మండపం, పులాంగ్ చౌరస్తా), 28, 29, 30 డివిజన్లు (గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఖిల్లా), 31, 32, 33 డివిజన్లు (జోన్-4 ఆఫీస్, అర్సాపల్లి వాటర్ ట్యాంక్), 34, 35, 36 డివిజన్లు (హమాల్‌వాడీ ఆఫీస్), 37, 38, 39 డివిజన్లు (జోన్-1 ఆఫీస్, నాందేవ్‌వాడ), 40, 41, 42 డివిజన్లు (జోన్-4, శానిటరీ వార్డ్ ఆఫీస్, కంఠేశ్వర్), 43, 44, 45 డివిజన్లు (రాజీవ్ గాంధీ ఆడిటోరియం), 46, 47, 48 డివిజన్లు (జోన్-2 ఆఫీస్, గోల్ హనుమాన్ వాటర్ ట్యాంక్), 49, 50, 51 డివిజన్లు (జోన్-3 ఆఫీస్, బడాబజార్ వాటర్ ట్యాంక్), 52, 53, 54 డివిజన్లు (గవర్నమెంట్ జూనియర్ కాలేజీ, ఖిల్లా), 55, 56, 57 డివిజన్లు (జోన్-3 ఆఫీస్, బడాబజార్ వాటర్ ట్యాంక్), 58, 59, 60 డివిజన్లు (జోన్-3 ఆఫీస్ బడాబజార్ వాటర్ ట్యాంక్) నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
బోధన్ మున్సిపాలిటీ..
బోధన్ మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు 69,417 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 33,696 మంది, మహిళలు 35,720 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. 1 నుంచి 24 వార్డుల నామినేషన్ల స్వీకరణకు బోధన్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోని 8 రూమ్‌లు ఏర్పాటు చేశారు. 25 నుంచి 38 వార్డుల నామినేషన్లు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బిల్డింగ్‌లోని ఐదు రూముల్లో నామినేషన్లు తీసుకుంటారు.
ఆర్మూర్ మున్సిపాలిటీ..
ఆర్మూర్ మున్సిపాలిటీలో 36 వార్డులు, 63,972 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు 30,648 మంది, మహిళలు 33,322 మంది ఉన్నారు. అక్కడి గవర్నమెంట్ జూనియర్ కాలేజీ బిల్డింగ్‌లో ఆర్వోలు నామినేషన్లు స్వీకరిస్తారు.
భీంగల్ మున్సిపాలిటీ..
భీంగల్ మున్సిపాలిటీలో 12 వార్డులుండగా, 14,045 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 6,616 మంది, మహిళలు 7,429 మంది ఉన్నారు. భీంగల్ ఎంపీడీవో ఆఫీస్‌లో 12 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తారు.
కామారెడ్డి మున్సిపాలిటీ..
కామారెడ్డి మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా, 99,313 మంది ఓటర్లు ఉన్నారు. 152 పోలింగ్ స్టేషన్లు, 17 నామినేషన్ల సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆర్వోలు, అసిస్టెంట్ ఆర్వోలు 21 మంది చొప్పున నియమించారు. జోనల్ అధికారులు 13 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 2, ఎస్ఎస్టీలు 2 టీమ్స్ నియమించారు.
బాన్సువాడ మున్సిపాలిటీ..
బాన్సువాడ మున్సిపాలిటీలో 19 వార్డులు ఉండగా, 24,188 మంది ఓటర్లు ఉన్నారు. 39 పోలింగ్ కేంద్రాలు, 7 నామినేషన్ల సెంటర్లను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 9 మంది చొప్పున నియమించారు. జోనల్ అధికారులు 4, ఫ్లయింగ్ స్వాడ్స్ 2, ఎస్ఎస్టీ టీమ్స్ 2 పని చేస్తాయి.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ..
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 13,265 మంది ఓటర్లు ఉన్నారు. 24 పోలింగ్ స్టేషన్లు, 4 నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 5 చొప్పున నియమించారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్ 2, ఎస్ఎస్టీ టీమ్స్ 2 నియమించారు.
బిచ్కుంద మున్సిపాలిటీ..
బిచ్కుంద మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా, 12,759 మంది ఓటర్లు ఉన్నారు. 24 పోలింగ్ కేంద్రాలు, 4 నామినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 5 చొప్పున నియమించారు. ఫ్లయింగ్ స్వ్కాడ్స్ 2, ఎస్ఎస్టీ టీమ్స్ 2 ఏర్పాటు
చేశారు.
నామినేషన్‌తో జత చేయాల్సిన సర్టిఫికెట్లు..
నామినేషన్ పత్రంలో పాటు ఏఏ సర్టిఫికెట్లు జతపర్చాలో అధికారులు సూచించారు. నామినేషన్ ఫారం, బర్త్ సర్టిఫికెట్ ( ఎస్సెస్సీ జిరాక్స్, ఓటరు ఐడీ కార్డు జిరాక్స్/ఆధార్ కార్డు జిరాక్స్) జత చేయాలి. రిజర్వుడు స్థానాల్లో కుల సర్టిఫికెట్, సెల్ప్ ఆఫిడవిట్ ( ఆస్తులు/ విద్యార్హతలు), బ్యాంక్ అకౌంట్ ( కొత్తగా తీయాలి), ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటిస్తానని సెల్ప్ డిక్లరేషన్ ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్( అభ్యర్థి/ ప్రతిపాదకుల), 2 ఫొటోలు జత చేయాల్సి ఉంటుంది.
