పద్మారావు నగర్, వెలుగు: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన రిలే నిరాహార దీక్ష మంగళవారం ముగిసింది. దీక్ష చివరి రోజున ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, టీపీసీసీ నేతలు నర్సారెడ్డి భూపతి రెడ్డి, పృధ్వీ చౌదరి, బీఎస్పీ నాయకుడు రాజేందర్ హాజరై తమ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కంటోన్మెంట్ ప్రజల పోరాటానికి భారీ మద్దతు లభించిందని, ఈ దీక్ష ద్వారా విలీన అంశం జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిందన్నారు. ఈ ఉద్యమాన్ని మరిన్ని రూపాల్లో ముందుకు తీసుకెళ్తామని, త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.
