పంజాగుట్ట, వెలుగు: ప్రజా యుద్ధ నౌక గద్దర్ జయంతి వేడుకలను ఈ నెల 31న రవీంద్రభారతిలో నిర్వహించనున్నట్లు గద్దర్ ఫౌండేషన్ ప్రకటించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఫౌండేషన్ వ్యవస్థాపకులు జీవీ. సూర్యకిరణ్, అరుణోదయ విమలక్క కలిసి ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు.
గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫౌండేషన్ చైర్‌పర్సన్ ప్రొఫెసర్ శాంత సిన్హాతో పాటు పృధ్వీ, రఫీ, జర్నలిస్టు విఠల్, శ్రీలత, రామిరెడ్డి తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.
