కేటీఆర్ ఒక ఫెయిల్యూర్ లీడరన్న విషయం జూబ్లీహిల్స్ లో మరోసారి రుజువైందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమీకృత మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేశారు .అనంతరం గజ్వేల్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. తాన్జీముల్ మజీద్ ఆధ్వర్యంలో మైనార్టీ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ కోచింగ్ సెంటర్ ప్రారంభించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రేసిడెంట్ గా లోచించాలన్నారు. 2019లో కారు ,సారు, సర్కారు, 16 అని పెద్ద పెద్ద ఫోలోలు పెట్టుకుని ఏడు పార్లమెంట్ సీట్లు ఓడిపోయారని గుర్తు చేశారు. 2023లో కూడా తానే సీఎం అవుతానని చెప్పి ప్రచారం చేసుకుంటే ప్రజలు ఆ పార్టీనే గద్దె దించారని చెప్పారు. ఇపుడు బీఆర్ఎస్ ను ఎవరు లీడ్ చేస్తారో, ఏం చేస్తారోనని ఆ పార్టీలోనే చ్చ జరుగుతుందన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి డిపాజిట్ కూడా రాదన్నారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన చేస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కూళ్లతో సంస్కరణలు తెచ్చామన్నారు.
