
- ధర్నాచౌక్ లో డీఎస్సీ 2008 బాధితుల సత్యాగ్రహ దీక్ష
ముషీరాబాద్, వెలుగు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతామని సీఎం కేసీఆర్ 2016లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డీఎస్సీ-– 2008 బాధితులు డిమాండ్ చేశారు. డీఎస్సీ – 2008 బీఈడీ మెరిట్ క్యాండిడేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో అభ్యర్థులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షుడు పి. ఉమా మహేశ్వర్ రెడ్డి, అభ్యర్థులు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ 2016లో వరంగల్‌లో జరిగిన సభలో 2008 డీఎస్సీ బాధితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారన్నారు. న్యాయపరంగా హైకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అయినా ఇప్పటి వరకు సమస్యకు పరిష్కారం లభించలేదని వాపోయారు. కార్యక్రమంలో డీఎస్సీ 2008 అభ్యర్థులు, జయప్రకాష్, విజయలక్ష్మి, మాధవి, జోష్ణ, సునీత, పద్మ శ్రీనివాస్ చావ్లా నరేశ్, బాపురెడ్డి రమేశ్, శేషు మురళి తదితరులు పాల్గొన్నారు.