
తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. తిరుపతిలోని కోరమేను గుంటలో ఉన్న సీపీఆర్ విల్లాలో జరిగిన హత్య స్థానికంగా కలకలం రేపింది. గురువారం ( ఆగస్టు 21 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తిరుపతిలోని కోరమేను గుంటలో ఉన్న సీపీఆర్ విల్లాలో 202 రూమ్ లో ఉంటున్న వృద్ధురాలు ధనలక్ష్మి దారుణ హత్యకు గురైంది. ధనలక్ష్మి కేర్ టేకర్ గా ఉంటున్న రవి ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.
గత కొంతకాలంగా ధనలక్ష్మి కేర్ టేకర్ గా ఉంటున్న రవి.. ఆమె గొంతు కోసి చంపి, చెవిలోని కమ్మలు లాక్కెళ్లాడని స్థానికులు తెలిపారు. ధనలక్ష్మి కుటుంబసభ్యులు హైదరాబాద్ లో ఉంటున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు స్థానికులు. ఈ ఘటనపై అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు.
స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న కేర్ టేకర్ రవి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ధనలక్ష్మి మరణంతో హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు.