హైదరాబాద్ అమీర్పేట్లో హనీ ట్రాప్.. 81 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. ఏడు లక్షలు ఎలా కాజేశారో చూడండి !

హైదరాబాద్ అమీర్పేట్లో హనీ ట్రాప్..  81 ఏళ్ల వృద్ధుడి నుంచి రూ. ఏడు లక్షలు ఎలా కాజేశారో చూడండి !

హనీ ట్రాప్ గురించి తెలిసే ఉంటుంది. రొమాంటిక్ మెసేజెస్, సెక్సువల్ సంభాషణలతో ముగ్గులోకి దించడం. ఈ ట్రాపింగ్ కు యువకుల నుంచి వృద్ధుల వరకు బాధితులు అవుతూనే ఉన్నారు. పండు ముసలివాళ్లలో కూడా ఆశలు రేకెత్తించి ముగ్గులోకి దించి భారీ ఎత్తున డబ్బులు కొట్టేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. హైదరాబాద్ లో వెలుగులోకి వచ్చిన హనీ ట్రాప్ కేసు గురించి తెలిస్తే ఇంత ఈజీగా ముగ్గులోకి దింపుతారా.. ఇంత సింపుల్ గా డబ్బులు కొట్టేస్తారా..? అనే ఆశ్చర్యం కలగక మానదు.

అమీర్ పేట్ లో 81 ఏళ్ల వృద్ధుడిని హనీ ట్రాప్ చేసి మోసగించారు సైబర్ చీటర్స్.  మాయా రాజ్ పుత్ అనే మహిళ పేరుతో వృద్ధుడికి కాల్స్ చేసి మాటల్లో దించారు దుండగులు. రొమాంటిక్ మెసేజెస్ తో ఆకట్టుకుని.. ఆ తర్వాత కాల్స్ చేసి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. జూన్ మొదటి వారం నుంచి వాట్సాప్ కాల్స్ ద్వారా వృద్ధుడిని లైన్లో పెట్టారు కిలాడీ స్కామర్స్. 

వృద్ధుడితో చనువుగా మాట్లాడుతూ హానీ ట్రాప్ చేశారు దుండగులు. ఆ తర్వాత తమ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటూ కట్టుకథలు చెప్పి డబ్బులు గుంజడం ప్రారంభించారు. వైద్యం ఖర్చులు , ఫ్లాట్ రిజిస్ట్రేషన్ , తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించడం కోసం అంటూ డబ్బులు లాగారు. 

బాధితుడిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి రూ.7 లక్షల 11 వేలు కాజేశారు స్కామర్స్. ఇంకా డబ్బులు డిమాడ్ చేయడంతో డౌట్ వచ్చిన వృద్ధుడు కుటుంబ సభ్యులకు చెప్పాడు.  కుటుంబ సభ్యుల సహాయంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధిత వృద్ధుడు. త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.