డీఎస్సీ పోస్టులు పెంచాలి.. పరీక్షలు 5 నెలలు వాయిదా వేయాలి

డీఎస్సీ పోస్టులు పెంచాలి..   పరీక్షలు 5 నెలలు వాయిదా వేయాలి
  • హైదరాబాద్​లోని సిటీ లైబ్రరీలో నిరుద్యోగుల ధర్నా

ముషీరాబాద్, వెలుగు: అసెంబ్లీలో సీఎం ప్రకటించినట్లుగా 13  వేల డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని, నవంబర్‌‌‌‌లో నిర్వహించే పరీక్షలను అయిదు నెలల పాటు వాయిదా వేయాలని హైదరాబాద్​ చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీలో గురువారం నిరుద్యోగులు ధర్నాకు దిగారు.  నిరుద్యోగుల సంఘం నాయకుడు లక్ష్మణ్ మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్ 13 వేల పోస్టులు భర్తీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించి, 5 వేల డీఎస్సీ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. 

నవంబర్ 21, 22 తేదీలతో పాటు వారం రోజుల పాటు పరీక్షలు జరుగుతాయని అదే నెలలో రెండో తేదీన గ్రూపు–2 పరీక్ష కూడా ఉందన్నారు.  గ్రూపు–2 , డీఎస్సీ పరీక్షలు  ఒకే నెలలో నిర్వహించడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు. నిరసనలో నిరుద్యోగులు సురేశ్, సలీం, పరశురాములు, మహేశ్, విఠల్, గిరి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు.