రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు

రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బెల్లంపల్లి ఏసీపీగా ఉన్న మహేష్ పెద్దపల్లి ఏసీపీగా బదిలీ అయ్యారు. అదేవిధంగా ఖమ్మం ఏసీపీగా గణేష్, మిర్యాలగూడ డీసీపీగా వెంకటగిరి, సంగారెడ్డి డీఎస్పీగా సామిండ్ల ప్రభాకర్, బాసర డీఎస్పీగా సురేష్, యాదాద్రి ఏసీపీగా సైదులు బదిలీ అయ్యారు. పంజాగుట్ట ఏసీపీగా మోహన్ కుమార్, చార్మినార్ ఏసీపీగా రుద్ర భాస్కర్, అబిడ్స్ ఏసీపీగా పూర్ణచందర్, నార్సింగి ఏసీపీగా  రమణగౌడ్, మలక్ పేట ఏసీపీగా శ్యామ్ సుందర్, చేవెళ్ల ఏసీపీగా ప్రభాకర్, కూకట్ పల్లి ట్రాఫిక్ ఏసీపీగా ధనలక్ష్మీ, మేడ్చల్ ఏసీపీగా సామల వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీగా రవి కుమార్ రెడ్డి, సౌత్ జోన్ ఏసీపీగా శ్రీనివాస్ రావు బదిలీ అయ్యారు. ఇటీవలే రాష్ట్రంలో 91 మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే.