పక్షి గూడు కోసం కారును వాడని దుబాయ్ ప్రిన్స్!!

పక్షి గూడు కోసం కారును వాడని దుబాయ్ ప్రిన్స్!!

న్యూఢిల్లీ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ తన దయార్ర్ద హృదయంతో నెటిజన్స్ మన్ననలు పొందుతున్నారు. తన కారులో పక్షి గూడు కట్టడాన్ని గమనించిన ప్రిన్స్ దాన్ని వాడటానికి నిరాకరించారు. గూడులో పక్షి గుడ్లు కూడా ఉండటం గమనార్హం. పక్షి గూడుకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు కారును వాడటానికి ప్రిన్స్ వద్దనడం అందర్నీ కదిలిస్తోంది. ఆ గూడుకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా ఉండేందుకు కారు చుట్టూ రెడ్ కలర్ టేపును కూడా వేయడం విశేషం.

పక్షి గూడుకు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ప్రిన్స్ బిన్ దానికి చక్కటి క్యాప్షన్‌ను కూడా జత చేశారు. కొన్నిసార్లు జీవితంలో చిన్న చిన్న విషయాలే సరిపోతాయి అని ట్వీట్‌కు ఉప శీర్షికను యాడ్ చేశారు. క్రౌడ్ ప్రిన్స్‌ వీడియో చాలా మందిని ఆకర్షిస్తోంది. చిన్న విషయాలే చాలా సంతోషాన్ని ఇస్తాయని, ప్రిన్స్‌ది గోల్డెన్ హార్ట్‌ అంటూ యూజర్స్ మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.