దుబ్బాక ఉప ఎన్నికతో కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి

దుబ్బాక ఉప ఎన్నికతో కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి

దుబ్బాక ప్రజలు కేసీఆర్ కు,టీఆర్ఎస్ పార్టీ కి గుణపాఠం చెప్పే అవకాశం వచ్చింది కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేసీఆర్ చేతిలో మోసపోయిన ప్రతి ఒక్కరూ ఈ ఉప ఎన్నికను అవకాశం వినియోగించుకోవాలని సూచించారు. పులివెందుల లో రాజకీయ ఎజెండా ను పక్కనపెట్టి రాజశేఖర రెడ్డి భార్య ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు. కేసీఆర్ మాత్రం… పి జనార్థన్ రెడ్డి చనిపోయినప్పుడు వారి ఇంటికి వెళ్లి మాటిచ్చి.. నోటిఫికేషన్ వచ్చాక అభ్యర్థి ని పెట్టి పోటీకీ తెరలేపాడన్నారు. నారాయణ ఖేడ్  ఉప ఎన్నికల్లో కూడా అదే విధంగా వ్యవహరించారన్నారు.

కేసీఆర్ గతంలో ఎన్నికలను కలెక్షన్స్ గా మార్చారన్నారు. ఉద్యమం లో ఎంతో గొప్పగా పోరాడిన రామలింగారెడ్డి ని ఎందుకు మంత్రిని చేయలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. మొదట రామలింగారెడ్డి కొడుక్కి టిక్కెట్ ఇస్తామని ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదో అందరికి తెలియదా? నేను చెప్పాలా ? అని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం లో దొమ్మాట పోయి దుబ్బాక అని పేరు మారింది… కానీ మన బతుకు మారలేదన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని ముత్యంరెడ్డి ని పార్టీ లోకి తీసుకొని మోసం చేస్తే బెంగతోని చనిపోయారన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కర్రుకాల్చి కేసీఆర్ కు వాత పెట్టడం ఖాయమన్నారు. తెలంగాణ సర్వరోగ నివారణ కావాలంటే దుబ్బాక లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నారు రేవంత్ రెడ్డి.