ఫీడ్ ది నీడ్​కు మేము సైతం

ఫీడ్ ది నీడ్​కు మేము సైతం

ఫీడ్ ది నీడ్​కు మేము సైతం

హైదరాబాద్, వెలుగు : కరోనా, లాక్ డౌన్ టైమ్​లో నిత్యావసరాలు, తిండిలేక చాలామంది ఇబ్బంది పడ్డారు. బస్తీలు, ఫుట్​పాత్​ల మీద ఉండే వారు దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీశారు. ఆ సమయంలో కొందరు తమ మంచి మనసును చాటుకున్నారు. ఇండ్లల్లోనే భోజనం వండి చుట్టుపక్కల వారికి పంచిపెట్టారు. మరికొందరు ఎన్జీవోలతో కలిసి పనిచేశారు. కరోనా కాలం గడిచిన తర్వాత కూడా ఈ పద్ధతి కొనసాగుతుండటం విశేషం. ప్రస్తుతం అనేకమంది సొంతంగా, గ్రూప్‌‌‌‌లుగా అవసరమున్నవారికి ఫుడ్ డొనేట్ ​చేస్తున్నారు.

సిటీలోని చాలా ప్రాంతాల్లో.. 

లాక్​డౌన్​లో పూట గడవక ఇబ్బంది పడే చాలా మంది ఆకలిని తీర్చారు కొందరు దాతలు. ఇప్పుడు కూడా వారు ఫీడ్​ది నీడ్​ను కొనసాగిస్తున్నారు. వీరిలో జాబర్స్, వ్యాపారులు, స్టూడెంట్లు కూడా ఉంటున్నారు. సిటీలోని బస్టాప్‌‌‌‌లు, ఫుట్​పాత్​లు, రైల్వేస్టేషన్ పరిసరాలు, స్లమ్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇలా అనేక చోట్ల భోజనంతోపాటు ఇతర వస్తువులను పంచిపెడుతున్నారు. ఇదివరకు పుట్టినరోజులు వంటి ప్రత్యేక రోజుల్లో తమకు దగ్గరలోని అనాథశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వెళ్లి సెలబ్రేట్​ చేసుకునేవారు. ఇప్పుడు మాములు రోజుల్లో కూడా సోషల్ సర్వీస్​ను కొనసాగిస్తున్నారు. గతంలో తమ వంతుగా ఏదైనా సాయం చేయాలంటే పలు స్వచ్ఛంద సంస్థలకు కొంతమొత్తం ఇచ్చేవారు. ఇప్పుడు అది కూడా కొనసాగుతుండగా.. మరికొందరు ఇంట్లో వండుకుని ప్యాక్ చేసి తీసుకెళ్తున్నారు. వారానికి ఒకరోజు, నెలలో ఇన్నిసార్లు అని భోజనాన్ని పంచిపెడుతున్నారు. 

ఎనిమిదేండ్లుగా ఫుడ్ అందిస్తున్నా..

2013 నుంచి సోషల్ యాక్టివిటీస్ మొదలుపెట్టా. నిమ్స్​లో చేరే పేదల కోసం కొన్నేళ్లుగా భోజనం వండుకుని తీసుకెళ్లడం మొదలుపెట్టా. అంకాలజీ, రేడియోలజీలోని పేషెంట్లతో పాటు వారి అటెండర్లకు కూడా ఫుడ్ పంపిణీ చేస్తున్నాం. కరోనా టైమ్ లోనూ ఫుడ్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం.
- సుధా కేశవరాజు, ఎంటర్ ప్రెన్యూర్

హెల్పింగ్ నేచర్ పెరిగింది

గతంతో పోలిస్తే ప్రస్తుతం జనాల్లో హెల్పింగ్ నేచర్ పెరిగింది. కరోనా టైమ్ లో పరిస్థితులను చూసి ఇతరులకు సాయం చేయాలనే ఆలోచన ఎక్కువైంది. అందుకే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు. మా ఎన్జీవోకి ఫుడ్ పంపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. 
- సంతోష్, వలంటీర్, పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్