హోలీ ఎఫెక్ట్‌‌..ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరోజు వాయిదా

హోలీ ఎఫెక్ట్‌‌..ఇంటర్ ఎగ్జామ్స్ ఒకరోజు వాయిదా
  •     మార్చి 3న జరగాల్సిన సెకండియర్ ఎగ్జామ్స్‌‌ 4కు చేంజ్
  •     మిగతా పరీక్షలన్నీ ఎప్పటిలాగే

హైదరాబాద్, వెలుగు: హోలీ పండుగ కారణంగా ఇంటర్మీడియెట్ సెకండియర్ ఎగ్జామ్స్ షెడ్యూల్‌‌‌‌లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 3న జరగాల్సిన పరీక్షలను మార్చి 4వ తేదీకి వాయిదా వేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో రిలీజ్‌‌ కానున్నాయి. ఇంటర్ అధికారులు గతంలో మార్చి 4న హోలీ పండుగ ఉంటుందని భావించారు. 

దీనికి అనుగుణంగా షెడ్యూల్​ ప్రకటించారు. అయితే, ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసిన జనరల్ హాలీడేస్ లిస్టులో మార్చి 3న హోలీ పండుగ సెలవురోజుగా ప్రకటించింది. దీంతో ఆ ఒక్క రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయనున్నారు. మిగిలిన పరీక్షలన్నీ ఇదివరకు ప్రకటించిన తేదీల్లోనే జరుగుతాయని అధికారులు చెప్తున్నారు.