
- శ్రీశైలం పవర్ ప్లాంట్లో ప్రమాదంపై నిర్దారణకొచ్చిన సీఐడీ!
- ఎంప్లాయీస్ అనుమానాలను పరిగణనలోకి తీసుకోని ఆఫీసర్లు
- ప్లాంట్లో నష్టం ఇప్పట్లో తేలనట్టే
టెక్నికల్సమస్య వల్లే శ్రీశైలం పవర్ ప్లాంట్లో మంటలు అంటుకుని ప్రమాదం జరిగిందని సీఐడీ నిర్దారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పవర్ ప్లాంట్లో బ్యాటరీలు చేంజ్ చేసేటప్పుడు న్యూకిలెన్స్ న్యూట్రల్ గా మారకపోవడం వల్లే కూడా ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. అదే సమయంలో టర్బైన్ వేగం పెరగడం వల్ల అధిక విద్యుత్తో ప్యానెల్ యూనిట్స్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చని కూడా అనుమానపడుతున్నారు. ఏదేమైనా షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడిన మంటలే ప్రమాదానికి ప్రధాన కారణంగా తేల్చే అవకాశముంది. అయితే ప్రతిపక్షాల విమర్శలు, విద్యుత్ ఉద్యోగులు, విద్యుత్ రంగ నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను విచారణ అధికారులు దాదాపుగా పక్కన పెట్టేసి నట్టు కనిపిస్తోంది.
ఇన్వెస్టిగేషన్లో స్పీడు
శ్రీశైలం ఎడమగట్టు పవర్ప్లాంట్ ప్రమాదంపై సీఐడీ ఇన్వెస్టిగేషన్లో స్పీడు పెంచింది. ప్రమాద స్థలాన్ని సీఐడీ అడిషనల్డీజీ గోవింద్ సింగ్, ఐజీ సుమతి తదితరులు శుక్రవారం పరిశీలించారు. ఫోరెన్సిక్, క్లూస్ టీమ్ ఆధారాలను సేకరించాయి. మూడు రోజులుగా ఇక్కడే మకాం వేసిన రెండు టీమ్ లు ఉద్యోగుల స్టేట్మెంట్లను రికార్డు చేస్తున్నాయి. ఘటన ఎన్ని గంటలకు జరిగింది, మంటలు ఆర్పేందుకు ఏంచర్యలు తీసుకున్నారు. ఆ టైమ్లో డ్యూటీలో ఉన్నవారిలో కొందరే ఎందుకు బయటకొచ్చారు. మిగిలిన వారు ఎందుకు బయటకు రాలేకపోయారు అనే అంశాలపై వివరాలు సేకరించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజు విద్యుత్ ప్లాంట్ ఎస్ఈ ఉమామహేశ్వరాచారి ఈగల పెంట పోలీస్స్టేష న్ లో ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
నష్టం ఇప్పట్లో తేలదా?
పవర్ ప్లాంట్లో జరిగిన ఆస్తి నష్టం ఎంతన్నదానిపై మరో 15 రోజులు గడిస్తేగానీ అంచనాకొచ్చే అవకాశాల్లేవని తెలుస్తోంది. ప్రస్తుతానికి వాటర్ తొలగించి మూడో ఫ్లోర్ వరకు లైటింగ్కనెక్షన్ఇచ్చారు. జనరే టర్లు, ట్రాన్స్ఫార్మర్లు, ప్యానెల్స్ఇతర పరికరాలను విడగొట్టి అందులోని భా గాలను పరిశీలించాకే నష్టం ఎంతన్నది తేలనుంది. సివిల్ వింగ్లో జరిగిన నష్టం పెద్దది కాకపోయినా వైబ్రేషన్ వల్ల అన్నిఫ్లోర్లలో శ్లాబులు, బండలు ధ్వంసమయ్యాయి. జనరేటర్, టరబైన్ బేస్ కదిలిందా, లేదా అన్నదీ పరిశీలించాల్సి ఉంది. 800 మెగావాట్ల పవర్ జనరేట్ అవుతున్న టైమ్లో షట్డౌన్చేయాలన్న బేసిక్రూల్కు విరుద్ధం గా 4, 5, 6 యూనిట్ల జనరేటర్లకు బ్యాటరీ కనెక్షన్ ఇవ్వడంతో ఒకే టైమ్లో ఏసీ, డీసీ పవర్సప్లైజరిగి షార్ట్సర్క్యూట్ మూలంగా మంటలు వచ్చాయనే దాన్ని టెక్నికల్లోపంగానే పరిగణించే చాన్స్ ఉంది
ఫిర్యాదులో ఏముంది?
20వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు పవర్ప్లాంట్లో మంటలు అంటుకోగా మెయిన్ కంట్రోల్రూమ్ నుంచి ఎస్ఈకి సమాచారం అందింది. వెంటనే జెన్కో ఉన్నతాధికారులకు ఎస్ ఈ విషయం తెలియజేశారు. డ్యూటీలో ఉన్న ఏడుగురు జెన్కో ఆఫీసర్లు, ఇద్దరు ప్రైవేట్బ్యాటరీ కంపెనీ ప్రతినిధులు ఫైర్ టీమ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అయినా ఫలితం లేకపోయింది. ప్లాంట్లోపల చిక్కుకున్న వారు పొగకు ఊపిరాడక చనిపోయారు.