విడాకులు వచ్చిన ఆనందం.. నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసిన భర్త.. ఫ్రీడమ్ అంటే ఇదే అంటూ..

విడాకులు వచ్చిన ఆనందం.. నాలుగు బకెట్ల పాలతో స్నానం చేసిన భర్త.. ఫ్రీడమ్ అంటే ఇదే అంటూ..

విడాకులు.. చాలామందికి ఇదొక చేదు జ్ఞాపకం.. పీడకల..!  కానీ ఓ భర్తకు మాత్రం ఇది స్వాతంత్ర్యాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చింది. ఎంత ఓపిక పట్టాడో.. ఆవేశాన్ని, ఆక్రోషాన్ని, బాధను మరెంతగా అణచిపెట్టుకున్నాడో కానీ.. డివోర్స్ వచ్చిన సందర్భంగా ఏకంగా నాలుగు బకెట్ల పాలతో స్నానం చేయటం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరీ వ్యక్తి.. ఏంటి ఇతని విడాకుల స్టోరీ అనేది తెలుసుకుందాం.

అస్సాం రాష్ట్రానికి చెందిన మాలిక్ అనే వ్యక్తి.. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విడాకులు మంజూరు కావడం అతనికి పండగను మించిన ఆనందాన్ని తెచ్చింది. విడాకులు వచ్చాయంటే ఎవరైనా మందేస్తారు లేదంటే బాధతో ఏడుస్తూ ఒంటరిగా కుంగిపోతుంటారు. కానీ ఈ వ్యక్తి తనకు తానే పాలాభిషేకం చేసుకుని ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. 

ఇంటి బయట.. నాలుగు బకెట్ల నిండా పాలు నింపుకుని.. ఒకదాని తర్వాత ఒకటి గుమ్మరించుకుంటూ అత్యంత ఉల్లాసంగా స్తానం చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. పాలతో స్నానం చేయడాన్ని అలీ కెమెరాలో రికార్డ్ చేశాడు. ‘‘ఈ రోజు నుంచి నేను ఫ్రీ’’ అంటూ కేరింతలు పెట్టడంపై నెటిజన్లు ఫుల్ కామెంట్స్ చేస్తున్నారు. 

‘‘నా భార్య తన లవర్ తో పారిపోతూనే ఉంది.. నేను మా ఫ్యామిలీ కోసం ఎంతో సైలెంట్ గా ఓపిక పడుతూ ఉండిపోయా..’’ అని వీడియాలో చెప్పాడు మాలిక్. స్థానికుల సమాచారం ప్రకారం.. అతని భార్య రెండు సార్లు లవర్ తో పారిపోయింది. దీంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. 

‘‘ మా విడాకులు ఫైనల్ అయ్యాయని అడ్వకేట్ చెప్పారు. డివోర్స్ ను సెలెబ్రేట్ చేసుకునేందుకు నేను పాలతో స్నానం చేస్తున్నాను. నాకు నేనే పాలాభిషేకం చేసుకుంటున్నాను. నాకు ఫుల్ ఫ్రీడమ్ వచ్చింది. పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వచ్చాయి.. ఈ రోజు నుంచి నేను ఫ్రీ’’ అంటూ ఆనందాన్ని వీడియో ద్వారా పంచుకున్నాడు.