కబ్జాదారులను లంచం అడిగిన వీఆర్ఏ సస్పెన్షన్

కబ్జాదారులను లంచం అడిగిన వీఆర్ఏ సస్పెన్షన్

ప్రభుత్వ భూమిలో కట్టుకున్న ఇండ్లు కూల్చొద్దంటే డబ్బులివ్వాలని డిమాండ్

కబ్జాదారులతో వీఆర్ఏ ఫోన్ ​సంభాషణ వైరల్

కుత్బుల్లాపూర్,వెలుగు: కబ్జాదారులను డబ్బు డిమాండ్​ చేస్తూ దుండిగల్​ వీఆర్​ఏ ఫోన్ ​సంభాషణ సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. దీంతో  అధికారులు ఆయనను సస్పెండ్​ చేశారు. దుండిగల్​ మండల పరిధి తండా–2లోని ప్రభుత్వ భూమిలో ఇటీవల కొందరు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వీరి ఇండ్లు కూల్చకూడదంటే.. డబ్బులు ఇవ్వాలని  వీఆర్ఏ యాదగిరి డిమాండ్ చేశారు. ఈ మేరకు మొబైల్  ఫోన్​లో మాట్లాడిన మాటల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మీ ఇండ్లు కూల్చకుండా ఉండాలంటే డబ్బు ఇవ్వాలని డిమాండ్​ చేశాడు. లేకపోతే నిర్మాణాలు కూల్చివేస్తామని, ఉన్నతాధికారులకు కూడా వాటాగా డబ్బు ఇవ్వాలని కబ్జాదారులతో మాట్లాడాడు.  ఈ సంభాషణ  సోషల్ ​మీడియాలో వైరల్​గా మారింది. కబ్జాదారులతో ఫోన్​లో మాట్లాడింది వీఆర్​ఏ యాదగిరేనని నిర్ధారించుకున్న దుండిగల్​ తహసీల్దార్  వి.భూపాల్ బుధవారం అతడిని  సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మండల అధికారులు స్పందించి తండా -2లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.