దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి రెడీ
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఓపెన్
హైదరాబాద్, వెలుగు: సిటీ ఐకానిక్‌గా రూపుదిద్దుకున్న దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు(జూన్ 2)న ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ హాజరయ్యే చాన్స్ ఉందని ఇంజినీరింగ్ వింగ్ అధికారి ఒకరు తెలిపారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్‌కు ఈ బ్రిడ్జి చెక్ పెట్టనుంది. మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య 2 కిలోమీటర్లు డిస్టెన్స్ తగ్గనుంది.
బ్రిడ్జి స్పెషాలిటీస్
2016లో ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా లండన్ ఆల్బర్ట్ బ్రిడ్జి మోడల్లో రూ.187 కోట్లతో జీహెచ్‌ఎంసీ ఈ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టింది.
దీనిపై వెహికల్స్‌కు 3 లైన్లతోపాటు ఇరువైపులా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. కేబుళ్లను ఆస్ట్రియా నుంచి తెప్పించారు. వరల్డ్‌లో 238 మీటర్ల పొడవున్న సిమెంట్ కాంక్రీట్ బ్రిడ్జి ఇదే. ఇప్పటివరకు దేశంలో అతిపెద్దదిగా గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలో 144 మీటర్ల కేబుల్ బ్రిడ్జి ఉంది. దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే ఆ రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరోవైపు ప్రభుత్వం దీన్ని టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేయనుంది. విజటర్స్ ఆహ్లాదంగా గడిపేందుకు థీమ్‌లు నిర్మిస్తోంది.
నేడు బయోడైవర్సిటీ ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్ ప్రారంభం..
బయో డైవర్సిటీ జంక్షన్‌లో నిర్మించిన ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్‌ను మున్సిపల్ మంత్రి కేటీఆర్ గురువారం ప్రారంభించనున్నారు. రూ.30.26 కోట్లతో ఫస్ట్ లెవల్ ఫ్లై ఓవర్ పనులు పూర్తి చేసినట్లు మేయర్రామ్మోహన్తెలిపారు. గచ్చిబౌలి – మెహిదీపట్నం వైపు ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తొలగినట్లేనని పేర్కొన్నారు.
For More News..
