బ్రెజిల్ ప్రధాని జెయిర్ బోల్సోనారో కు చేదు అనుభవం ఎదురైంది. జూమ్ యాప్ మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఓ వ్యక్తి స్నానం చేస్తూ నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు.
లాక్ డౌన్ పై భవిష్యత్ కార్యచరణ ప్రకటించేందుకు ప్రధాని జెయిర్ ఆ దేశ పరిశ్రమల శాఖ మంత్రితో పాటు పలువురు ఉన్నతాదికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఓ వ్యక్తి నగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. దీంతో ఆసహానానికి గురైన ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ లో ఏం జరుగుతోంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీన్ని కవర్ చేసేందుకు పరిశ్రమల మంత్రి పాలో గిడ్డెస్ కలుగజేసుకొని.. ఇలా అన్నారు..బట్టలు లేకుండా, స్నానం చేసే వ్యక్తి ఉన్నాడు..విషయం ఏమిటంటే, అతను బట్టలు లేకుండా ఇంట్లో ఒంటరిగా ఉంటాడు. అతను సంభాషణ నుండి వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తుంది, కాబట్టి చల్లటి నీటితో స్నానం చేయడానికి వెళ్ళాడు..అని చమత్కరించారు.
దీంతో ఆ వీడియో కాన్ఫరెన్స్ ను అంతటితో ముగించి..సదరు నగ్నంగా ప్రత్యక్షమైన ఆ వ్యక్తిపై ప్రధాని జెయిర్ బోల్సోనారో విచారణకు ఆదేశించారు.
