ఫ్రై డే ప్రేయర్స్ .. పాతబస్తీలో టైట్ సెక్యూరిటీ

ఫ్రై డే ప్రేయర్స్ .. పాతబస్తీలో టైట్ సెక్యూరిటీ
  • రాజాసింగ్కు మద్దతుగా బేగంబజార్ బంద్ కంటిన్యూ

హైదరాబాద్: పాతబస్తీలో పోలీసు బలగాలను భారీగా మొహరించారు. ఇవాళ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనలు జరగనుండటంతో మక్కా మసీదు, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు, బెటాలియన పోలీసులతో ఫుల్ సెక్యూరిటీ పెట్టారు. సమస్యాత్మక ప్రాంతాలతో పాటు ప్రార్థనలు జరిగే అన్ని ప్రాంతాల్లో బందోబస్తు కంటిన్యూ అవుతోంది.

మరోవైపు బేగంబజార్ లో వ్యాపారులు రాజాసింగ్కు అనుకూలంగా ధర్నాలు చేసే అవకాశం ఉండటంతో అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. పాతబస్తీలో పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని.. శాంతిభద్రతలకు అందరూ సహకరించాలని పోలీసు అధికారులు కోరుతున్నారు. పాతబస్తీ మొత్తం నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.