ప్రధాని మోదీ పర్యటనతో.. తెలంగాణ రాష్ట్రంలో.. జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు

ప్రధాని మోదీ పర్యటనతో.. తెలంగాణ రాష్ట్రంలో.. జాతీయ రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు

జులై 8వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసు అధికారులు ట్రాఫిక్ రూల్స్ తో పాటు పలు ఆంక్షలు విధించారు. మోదీ టూర్ సందర్భంగా వరంగల్, హనుమకొండ నగరాల్లో ట్రాఫిక్ మళ్లింపుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు చెప్పారు. హైదరాబాద్, ఖమ్మం, హుజురాబాద్, ములుగు ప్రాంతాల నుండి వచ్చే వాహనదారులు తాము సూచించిన మార్గాల్లో ప్రయాణించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. 

* హుజురాబాద్ వైపు నుండి హైదరాబాద్, ఖమ్మం ప్రాంతాలకు వెళ్లే వాహనాలు చింతగట్టు ఓఆర్ఆర్ .. కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం, ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సి ఉంటుంది. 

* పర్కాల, ములుగు మార్గాల నుండి హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఓఆర్ఆర్, కరుణాపురం మీదుగా హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుంది. కరుణాపురం ఐనవోలు, పున్నేలు మీదుగా ఖమ్మంకు పోవాల్సి ఉంటుంది.

* నర్సంపేట నుండి హైదరాబాద్, కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్ జంక్షన్, దేశాయిపేట్ 80ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్ జంక్షన్, పెద్దగడ్డ, కేయూ జంక్షన్, చింతగట్టు ఓఆర్ఆర్ మీదుగా పోవాల్సి ఉంటుంది. 

* వర్ధన్నపేట నుండి హైదరాబాద్, కరీంనగర్, ములుగు, పర్కాల, భూపాలపల్లి వెళ్లే వాహనాలు పున్నేలు క్రాస్ నుండి డైవర్షన్ తీసుకోని.. ఐనవోలు, కరుణాపురం ఓఆర్ఆర్ మీదుగా పోవాల్సి ఉంటుంది.

* హైదరాబాద్, ఖమ్మం నుండి వచ్చే వాహనాలు పైన సూచించిన మార్గాల మీదుగా చేరుకోవాల్సి ఉంటుంది.

* హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో జరిగే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభకు వచ్చే వాహనాలు ఈ మార్గాల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

* హుజురాబాద్ వైపు నుండి వచ్చే వాహనాలు కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ.ఈ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. 

* పర్కాల, భూపాలపల్లి, ములుగు నుండి వచ్చే వాహనాలు పెద్దమ్మగడ్డ డైవర్షన్ నుండి కేయూసీ జంక్షన్, 100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ.ఈ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

* నర్సంపేట వైపు నుండి వచ్చే వాహనాలు వెంకట్రామ జంక్షన్, పోచమ్మమైదాన్, జంక్షన్, దేశాయిపేట్ 80 ఫీట్ రోడ్, ఆటోనగర్, హనుమన్ జంక్షన్, పెద్దమ్మగడ్డ, కేయూ జంక్షన్,100 ఫీట్ల రోడ్ మీదుగా సెయింట్ పీటర్ ఫార్మసీ కాలేజ్, అంబేద్కర్ భవన్, గోకుల్ జంక్షన్ మీదుగా సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను ఇదే మార్గంలో తిరిగి వెళ్లి కేయూసీ ఎస్.డీ.ఎల్.సీ. ఈ మైదానంలో తమ వాహనాలను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

పై మూడు మార్గాల నుండి వచ్చే వాహనాలు ఉదయం 9.30 గంటల లోపు సుబేదారి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. తరువాత వచ్చే వాహనాలు కేయూసీ జంక్షన్ వరకు మాత్రమే అనుమతిస్తారు. 

* వర్ధన్నపేట నుండి వచ్చే వాహనాలు పున్నేలు క్రాస్, ఐనవోలు, కరుణాపురం మడికొండ, కాజీపేట మీదుగా ఫాతిమా జంక్షన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను సెయింట్ గ్రాబియల్ స్కూల్ మైదానంలో పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. 

* ఘన్ పూర్ నుండి వచ్చే వాహనాలు కరుణాపురం మడికొండ, కాజీపేట మీదుగా ఫాతిమా జంక్షన్ వద్ద ప్రజలను దించిన తర్వాత ఖాళీ వాహనాలను సెయింట్ గ్రాబియల్ స్కూల్ మైదానంలోపార్కింగ్ చేయాల్సి ఉంటుంది.

ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 4 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్నాయి.