25న అలయ్ బలయ్.. ఎన్నికల కోడ్ కు లోబడే ప్రోగ్రాం

25న అలయ్ బలయ్.. ఎన్నికల కోడ్ కు లోబడే ప్రోగ్రాం

హైదరాబాద్: ఈ నెల 25న నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దసరా అలయ్ బలయ్  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆహ్వాన కమిటీ చైర్ పర్సన్ బండారు విజయ లక్ష్మి చెప్పారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. 17 ఏండ్ల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. తెలంగాణ  సంస్కృతి  ఉట్టిపడేలా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.

ఈ ప్రోగ్రామ్ కు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ తో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లను ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు.  ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులకు కూడా ఆహ్వానాలు పంపినట్టు చెప్పారు. గ్రామీణ వాతావరణాన్ని సిటీలోకి తీసుకురావడంలో భాగమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమన్నారు.