గ్రేటర్​ సిటీలో ఫెస్టివల్ మూడ్​ .. దసరా, దీపావళి పండుగలతో కొత్త ఉత్సాహం

గ్రేటర్​ సిటీలో ఫెస్టివల్ మూడ్​ .. దసరా, దీపావళి పండుగలతో  కొత్త ఉత్సాహం
  • నవరాత్రులకు సిద్ధమవుతున్న సిటీ జనం
  • దాండియా ఆటలతో జోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో యువత
  • పండుగ షాపింగ్​తో మాల్స్​లో పెరుగుతున్న రద్దీ 

హైదరాబాద్, వెలుగు: శరన్నవరాత్రులు, దసరా, దీపావళి పండుగలు రానుండడంతో గ్రేటర్ సిటీలో ఫెస్టివల్ మూడ్​కనిపిస్తున్నది.  జంట నగరాల్లో యువతీ యువకుల కోలాహలంతో కనుల పండుగలా మారింది. దసరా ఉత్సవాల సందర్భంగా దాండియా ఆటలు ఆడనున్నారు.  కొన్ని  క్లబ్బులు, హోటళ్లలో దాండియా నిర్వహించడానికి పలు ఈవెంట్​ సంస్థలు సిద్ధమవుతున్నాయి.  ప్రతి సంవత్సరం కీస్​ హైస్కూల్, బేగంపేట గ్రౌండ్​, ఇందిరా పార్క్, సికింద్రాబాద్ గుజరాతీ స్కూల్​, పింగళి వెంకట్రామ్​ రెడ్డి హాల్, బేగంబజార్​ వంటి చోట్ల దాండియా నిర్వహిస్తుంటారు. సిటీలోని బెంగాలీలు, గుజరాతీ సంఘాలు పెద్దఎత్తున  దాండియా నిర్వహిస్తుంటాయి.  నవరాత్రుల సందర్భంగా నగరమంతా దీపకాంతులతో మెరిపోతాయి.  పలు ప్రాంతాల్లో యువతులు దాండియా కోసమే ప్రత్యేక డ్రెస్సులను కొనుగోలు చేస్తుంటారు. 

9 రోజుల వేడుకలకు సిద్ధం 

ఈ నెల 15 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకులను ఏర్పాటు చేసిన మండపాల్లోనే చాలా చోట్ల దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించనున్నారు.  పలు ప్రాంతాల్లో దుర్గామాత మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పటికే దూల్​పేట, మంగళ్​హాట్​ వంటి ప్రాంతాల్లో దుర్గామాత విగ్రహాల తయారీ కొనసాగుతున్నది. ఈసారి గణేష్​ మండపాల మాదిరిగానే దుర్గా మాత మండపాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

 కేవలం తెలుగువారే కాకుండా గుజరాతీలు, బెంగాలీలు సిటీలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.  అమ్మవారి ఉత్సవాలతో నగరానికి కొత్త శోభ సంతరించుకోనుంది.  దసరా సందర్భంగా కొత్త బట్టలు కొనుక్కోవడం ఆనవాయితీ.  అందుకనుగుణంగా సిటిజన్లు చేసే షాపింగ్​తో మాల్స్​రద్దీగా కనిపిస్తున్నాయి.

పండుగల వేళ.. ఆఫర్ల వెల్లువ

సిటీలో వ్యాపారులు కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు.  ముఖ్యంగా కొత్త దుస్తులను కొనుగోలు చేసే వారికి సిటీలోని షాపింగ్​మాల్స్ చందన బ్రదర్స్​, సీఎంఆర్,  సౌత్​ ఇండియా , చెన్నయ్​ షాపింగ్ మాల్​, కళామందిర్, వర మహాలక్ష్మి, కేఎల్ఎం వంటి సంస్థలు, జాయ్​అలుక్కాస్​, లలితా జువెలరీ, ఖజానా, సీఎంఆర్, కళ్యాణ్ ​జువెలర్స్ లాంటి సంస్థలే కాకుండా పలు రకాల బ్రాండెడ్​ దుస్తుల కంపెనీలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. 

ఆయా సంస్థలు మహిళల వస్ర్తాలపై 20 నుంచి 70 శాతం వరకు డిస్కౌంట్స్ ప్రకటించారు.  ఒకటి కొంటే ఒకటి ఫ్రీ లాంటి స్కీమ్​లు,  కిలోల చొప్పున దుస్తులు అమ్మకాలు వంటి అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇక గోల్డ్​వ్యాపారులు కొనుగోలుదారులకు వివిధ రకాల ఆఫర్లు ఇస్తున్నారు. ప్రధానంగా నో మేకింగ్​చార్జీలు, తరుగు తక్కువ, వాయిదా పద్ధతుల్లో జువెలరీ కొనుగోలు చేసే రకరకాల ఆఫర్లను ప్రకటిస్తున్నారు.  బిగ్ సీ, సంగీత వంటి సంస్థలు మొబైల్​ఫోన్లపై జీరో పర్సెంట్​వడ్డీ, క్యాష్​బ్యాక్​ ఆఫర్లు, వివిధ రకాల గిఫ్టులు ఆఫర్ చేస్తున్నారు.  సంగీత వంటి కంపెనీ ఒక అడుగు ముందుకేసి రోజువారీగా రూ. 92, రూ. 139 చెల్లించేలా శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై వాయిదా పద్ధతిలో అందిస్తున్నారు.  పలు రకాల ఎలక్ట్రానిక్స్​ ఉత్పత్తులు టీవీలు, ఎల్ఈడీలు, కంప్యూటర్లు, ఫ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  వాషింగ్​మెషీన్ లాంటి ఉత్పత్తులపై స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. 

ఆన్​లైన్ ​షాపింగ్ వేరే లెవెల్..

దసరా, దీపావళి పండుగలే టార్గెట్​గా ప్రతి ఏడాది ప్రముఖ ఆన్​లైన్ ఈ– కామర్స్ సంస్థలు  అమెజాన్, ఫ్లిప్​కార్ట్  స్పెషల్ ఆఫర్లతో భారీ సేల్​ను నిర్వహిస్తుంటాయి. ఈ నెల 8 నుంచి 15వ తేదీ వరకు అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ’పేరుతో, ఫ్లిప్ కార్ట్ ‘బిగ్ బిలియన్ డే’ పేరుతో సేల్స్ నిర్వహిస్తున్నాయి. క్రెడిట్ కార్డులతో షాపింగ్ చేస్తే మరింత డిస్కౌంట్​ను ప్రకటిస్తున్నాయి. ఈ ఆన్ లైన్ షాపింగ్​కు సిటిజన్ల నుంచి ప్రతి ఏడాది భారీగా రెస్పాన్స్ ఉంటుంది. 

దీంతో పాటు ఫ్యాషన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసే మింత్రా ఫ్యాషన్ ఫెస్టివల్ సేల్స్ ఈ నెల 9న ప్రారంభమైంది. ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బ్యూటీ, లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తులపై భారీ ఎత్తున డిస్కౌంట్​ను అందిదిస్తున్నది. ఈ బిగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్యాషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మింత్రా కో బ్రాండ్ క్రెడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్డు కస్టమర్లకు 15 శాతం డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించనుంది. కొటక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహీంద్రా బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ , ఐసీఐసీఐ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డులపై 10 శాతం ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించనుంది.  

కొనుగోళ్లపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం

దసరా, దీపావళి ఆఫర్లను ప్రకటించాం.  నగరంలో షాపింగ్​ సందడి బాగా పెరిగింది. ఆఫర్ల కోసం వచ్చే వారి సంఖ్య బాగా ఉంది. అందుకనుగుణంగా మేం వారికి పలు రకాల ఆఫర్లను ఇస్తున్నాం.

నరేశ్, చందన బ్రదర్స్​ సికింద్రబాద్​ మేనేజర్​

గతంలో కంటే ఈసారి  ఎక్కువ ఆఫర్లు
గత సంవత్సరం కంటే ఈసారి మరిన్ని ఎక్కువ ఆఫర్లను ఇస్తున్నాం. రకరకాల సెల్​ఫోన్​ ఉత్పత్తులపై స్పెషల్​ ఆఫర్లను ఇస్తున్నాం. దసరా, దీపావళి సందర్బంగా మరికొన్ని ప్రత్యేక ఆఫర్లు రానున్నాయి. 

నితిన్​, బిగ్ సీ  సికింద్రాబాద్​షోరూమ్​ మేనేజర్​