13 నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

13 నుంచి ఇంటర్ కాలేజీలకు దసరా సెలవులు

13 నుంచి ఇంటర్ కాలేజీలకు కూడా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బుధవారం నుంచి బడులకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈనెల 6 నుంచి17 వరకు  12 రోజులపాటు సెలవులు ఉంటాయని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. 18న బడులు రీఓపెన్ అవుతాయన్నారు. కాగా, సెప్టెంబర్ 1 నుంచే ఫిజికల్ క్లాసులు మొదలు కాగా, నెలరోజుల్లో 12రోజుల పాటు బతుకమ్మ, దసరా పండుగల సెలవులు వచ్చాయి. అన్ని ఇంటర్ కాలేజీలకు ఈ నెల13 నుంచి17 దాకా సెలవులుంటాయని ఇంటర్ బోర్డు సెక్రటరీ ఉమర్ జలీల్ తెలిపారు. సెలవుల్లో కాలేజీలు క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.