మైసూరులో కన్నుల పండుగలా దసరా ఉత్సవాలు

మైసూరులో కన్నుల పండుగలా దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పాల్గొన్నారు. దసరా ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు. నవరాత్రి వేడుకలను విజయ దశమితో కలిపి పది రోజులు జరుపుతారు. మైసూరు దసరా వేడుకలకు 5 వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ వేడుకలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు భారీ సంఖ్యలో వచ్చారు. మైసూర్ లో జరిగే దసరా వేడుకలు అమ్మవారి పూజలకే పరిమితం కాదు. ఆ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలియజేస్తాయి.