వారం రోజుల ముందే మొదలైన దసరా నవరాత్రుల సందడి

వారం రోజుల ముందే మొదలైన దసరా నవరాత్రుల సందడి
  • దాండియా జోష్ షురూ
  • వారం రోజుల ముందే మొదలైన దసరా నవరాత్రుల సందడి

హైదరాబాద్, వెలుగు: సిటీలో దసరా సందడి మొదలైపోయింది.  నవరాత్రి ఉత్సవాల్లో స్పెషల్​గా నిర్వహించే  దాండియా కోసం ఇప్పటి నుంచే ఈవెంట్ ఆర్గనైజర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.  దాండియా, గర్బా డ్యాన్స్ కోసం స్పెషల్ ప్రోగ్రామ్​లు చేసేందుకు రెడీ అవుతున్నారు. నవరాత్రులు మొదలవడానికి ఇంకా 3 రోజులు ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే సిటీలో సందడి షురువైంది.

ఈవెంట్ల జోరు..


సిటీలో  న్యూ ఇయర్ నుంచి ఫెస్టివల్స్ వరకు అంతా కలిసి ఒక దగ్గర జరుపుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో విభిన్నరకాల థీమ్‌‌‌‌‌‌‌‌లతో ఈవెంట్లను నిర్వహిస్తున్నారు ఆర్గనైజర్లు. కరోనా ఎఫెక్ట్ తో రెండేళ్లుగా సిటీలో నవరాత్రి ఉత్సవాలు అంత జోష్  కనిపించలేదు.  అయితే ఈ సారి మాత్రం రెట్టింపు హుషారుతో జరగనున్నాయని అంటున్నారు ఈవెంట్ ఆర్గనైజర్లు. ఇప్పటికే నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్తున్నారు. మాస్  గ్యాదరింగ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు సిటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. నవకర్ నవరాత్రి ఉత్సవ్, దాండియా నైట్స్, మలంగ్ ఈవెంట్స్, దిల్ సే దాండియా ఇలా రకరకాల పేర్లతో పదుల సంఖ్యలో ఈవెంట్లు జరగనున్నాయి. వీటికి సంబంధించి బుకింగ్స్ కూడా ఓపెన్ అయినట్లు ఆర్గనైజర్లు చెప్తున్నారు.

బుక్ మై షో, ఇన్‌‌‌‌‌‌‌‌సైడర్, పేటీఎం, ఈవెంట్స్ నౌ వంటి యాప్‌‌‌‌‌‌‌‌లలో ఈ ప్రోగ్రాంలకు సంబంధించిన టికెట్లు అందుబాటులో ఉన్నాయంటున్నారు. ఆటపాటలతో..దాండియా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్‌‌‌‌‌‌‌‌, లైవ్ మ్యూజిక్‌‌‌‌‌‌‌‌తో ఈ వేడుకలు జరగనున్నాయి.  అథెంటిక్ ఫుడ్ బఫే స్టాళ్లు, ఫన్ ఆక్టివిటీలు, డ్యాన్‌‌‌‌‌‌‌‌లు ఏర్పాటుచేయనున్నారు. నవరాత్రుల టైమ్​లో ప్రతి రోజు సాయంత్రం ఈ ఆట పాటలు కొనసాగనున్నాయి. ఇందుకోసం యూత్ ఇప్పటి నుంచే రెడీ అయిపోతున్నారు. దాండియాకు కావాల్సిన ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ కొనేందుకు కోఠి, సుల్తాన్ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షాపింగ్ చేస్తున్నారు. నాలుగైదు రోజులుగా అక్కడి షాపుల్లో కస్టమర్ల రద్దీ పెరిగినట్లు ఓనర్లు చెబుతున్నారు.

బుకింగ్స్ అవుతున్నాయి..

సిటీలో రెండు చోట్ల ఈవెంట్లు చేస్తున్నాం. ఈ నెల 26 నుంచి మొదలవుతున్నాయి. బిగ్గెస్ట్ నవరాత్రి ఉత్సవ్– 2022, నవరాత్రి ఉత్సవ్- 2022 పేరుతో నిర్వహిస్తున్నాం. బుకింగ్స్ ఓపెన్ చేశాం. గత రెండేళ్లతో పోలిస్తే ఈసారి సిటిజన్ల నుంచి ఫుల్ రెస్పాన్స్ వస్తోంది.   - సుమంత్, ఈవెంట్ ఆర్గనైజర్

ఫుల్ జోష్..

ప్రతి ఇయర్ ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టిసిపేట్ చేస్తుంటాం. నవరాత్రి స్టార్ట్ అవుతుందంటే కాస్ట్యూమ్స్ తీసుకుని రెడీ అవుతాం. మా కమ్యూనిటీలో దాండియా సెలబ్రేట్ చేస్తారు. దాంతోపాటు బయట కండెక్ట్ చేసే ఈవెంట్లకు కూడా వెళ్తుంటాం.

- మౌనిక, స్టూడెంట్, మణికొండ