దసరా లిక్కర్ లెక్క రూ. 698 కోట్లు

దసరా లిక్కర్ లెక్క రూ. 698 కోట్లు

=  గతేడాదితో పోలిస్తే 76% హైక్
= 3 రోజుల్లో 6 లక్షల 71 వేల కేసుల లిక్కర్ సేల్
=  7 లక్షల 22 వేల కేసుల బీరు అమ్మకం 
= సెప్టెంబర్ లో రూ.3,048 కోట్ల లిక్కర్ సేల్స్

హైదరాబాద్ : దసరా పండుగకు రూ. 698 కోట్లు లిక్కర్ వ్యాపారం జరిగింది.  ఈ సారి దసరా పండుగ గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినా... ప్రభుత్వం ఒక రోజు మద్యం విక్రయాలపై నిషేధం విధించినా. అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. గ్లాసుల గలగల వినిపించింది.  గత నెల29, 30, అక్టోబర్ 1 తేదీల్లో రూ. 698.33 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్టు ఆబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. ఇది గత ఏడాదితో పోల్చిదే 76% ఎక్కువ కావడం విశేషం.  సెప్టెంబర్ నెలలో 3048.51 వేల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గత నెల 29న 278 కోట్ల 66 లక్షలు, 30న  333.44 కోట్ల మద్యం సేల్ అయినట్టు తెలుస్తోంది.

దసరాకు ముందు రోజైన ఒకటో తారీఖు రోజున  47 కోట్ల 79 లక్షల వ్యాపారం జరిగింది.  ఈ మూడు రోజుల్లో 6 లక్షల 71 వేల కేసుల లిక్కర్ సేల్ అయినట్టు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. 7 లక్షల 22 వేల కేసుల బీర్లు సైతం అమ్ముడు పోయాయి. గత ఏడాది ఇదే సమయంలో మూడు రోజుల్లో 530 కోట్ల లిక్కర్ వ్యాపారం  జరిగింది. ఈ  ఏడాది దసరా కు ఈ మూడు రోజుల్లో 698 కోట్ల 33 లక్షల లిక్కర్  సేల్స్ జరగడం గమనార్హం. మొత్తంగా గత ఏడాదితో పోల్చితే  76% పెరిగిన మద్యం అమ్మకాలు  జరిగాయి.  సెప్టెంబర్ నెల రోజులతోపాటు అక్టోబర్ నెలలోని 1,2 తారీఖుల్లో కలిపి 3096 కోట్ల 30 లక్షల లిక్కర్ వ్యాపారం సాగింది.  

మటన్ షాపులు ఓపెన్

గాంధీ జయంతి సందర్భంగా మటన్, చికెన్ షాపులు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆ  నిబంధన ఎక్కడా అమలు కాలేదు. చాలా  చోట్ల మటన్ షాపులు డైరెక్టుగా ఓపెన్ ఉన్నాయి. హైదరాబాద్ లో ని ప్రధాన ప్రాంతాల్లోనూ మటన్ విక్రయాలు సాగాయి. దీంతో ఈ దసరా చుక్క, ముక్కతో ఎప్పటిలాగే కొనసాగింది.