V6 News

భారత సంతతి సైంటిస్ట్​కు ‘డచ్ నోబెల్ ప్రైజ్’

భారత సంతతి సైంటిస్ట్​కు ‘డచ్ నోబెల్ ప్రైజ్’

న్యూఢిల్లీ: భారత సంతతి సైంటిస్ట్ జోయితా గుప్తాకు ‘డచ్ నోబెల్ ప్రైజ్’ దక్కింది. ఇది నెదర్లాండ్స్ లో సైన్స్ రంగంలో కృషి చేసే వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం. నిజానికి ఈ అవార్డు పేరు స్పినోజా ప్రైజ్ కాగా, డచ్ నోబెల్ ప్రైజ్ గా పిలుస్తుంటారు. జోయితా గుప్తా ఆమ్ స్టర్ డామ్ యూనివర్సిటీలో ఎన్విరాన్ మెంట్ విభాగంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.

సైన్స్ రంగంలో ఆమె చేసిన కృషికి గాను అవార్డు దక్కిందని ఆమ్ స్టర్ డామ్ యూనివర్సిటీ గురువారం ప్రకటనలో పేర్కొంది. అవార్డు ప్రదానోత్సవం అక్టోబర్ 4న ఉంటుందని తెలిపింది. ఈ అవార్డు కింద గుప్తాకు రూ.13.31 కోట్ల ప్రైజ్ మనీ దక్కుతుందని, ఈ డబ్బును సైంటిఫిక్ రీసెర్చ్ కు వినియోగించాల్సి ఉంటుందని చెప్పింది.