సమాధిలో ధ్యానం.. ఒత్తిడి మాయం!

సమాధిలో ధ్యానం.. ఒత్తిడి మాయం!

నెదర్లాండ్‌‌‌‌ వర్సిటీ వెరైటీ ఐడియా

ఎగ్జామ్స్‌‌‌‌ వస్తున్నాయంటే స్టూడెంట్లు కలవర పడిపోతుంటారు. టెన్షన్‌‌‌‌ పడుతుంటారు. ఆగమాగమైపోతుంటారు. ఇలాంటి స్టూడెంట్ల ఒత్తిడిని తగ్గించేందుకు నెదర్లాండ్స్‌‌‌‌లోని ఓ యూనివర్సిటీ వెరైటీ పరిష్కారం చూపింది. నిజ్‌‌‌‌మెగాన్‌‌‌‌లో ఉన్న రాడ్‌‌‌‌బౌడ్‌‌‌‌ వర్సిటీ స్టూడెంట్ల ఒత్తిడి తగ్గడానికి ‘ధ్యాన  సమాధి’ కాన్సెప్ట్‌‌‌‌ బాగా పని చేస్తుందని చెబుతోంది. వర్సిటీలోని ప్రార్థనాలయం వెనకనే పెద్ద పెద్ద గుంతలు తవ్వి ధ్యానం చేసుకోవడానికి మ్యాట్లు కూడా ఏర్పాటు చేసింది. అక్కడ ఇది ఇప్పటికే మస్తు పాపులరైంది. గ్రేవ్‌‌‌‌ ఎక్స్‌‌‌‌పీరియెన్స్‌‌‌‌ కోసం చాలా మంది వెయిట్‌‌‌‌ కూడా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ఫౌండర్‌‌‌‌ జాన్‌‌‌‌ హ్యాకింగ్‌‌‌‌. ప్రార్థనాలయం స్టాఫ్‌‌‌‌ మెంబర్‌‌‌‌. ఈ ప్రాజెక్టును ‘మెమెంటో మోరీ (గుర్తుపెట్టుకో నువ్వు చనిపోతావు)’ పేరుతో అడ్వర్టైజ్‌‌‌‌ చేస్తున్నారు. స్టూడెంట్లు 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు సమాధిని బుక్‌‌‌‌ చేసుకోవచ్చు.

Dutch University Digs 'Meditation Grave' for Students to Deal With Stress